Rajya Sabha: పౌరస్మృతి బిల్లుపై పెద్దల సభలో రగడ…
Rajya Sabha: ఎప్పటి నుంచే దేశంలో పౌరస్మృతి చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా, ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఈ బిల్లుకు అనుకూలంగా ఉండటంతో అమలు చేసేందుకు కేంద్రం సైతం ఆసక్తిగా ఉన్నది. ఈనేపథ్యంలో దీనిపై బీజేపీ ఎంపి కిరోడిలాల్ రాజ్యసభలో ప్రైవేటు బిల్లుగా దీనిని ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే, ఈ బిల్లుకు అనుమతించాలా వద్దా అనే అంశంపై స్పీకర్ ఓటింగ్‌ను నిర్వహించారు.
ఈ బిల్లుకు 63 మంది అనుకూలంగా ఓటు వేయగా, 23 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. బిల్లుకు అనుకూలంగా మెజారిటీ రావడంతో బిల్లును ప్రవేశపెట్టారు. జాతీయ దర్యాప్తు, పరిశోధన కమిటీకి ఈ బిల్లును రూపొందించే బాధ్యతను అప్పగించాలని ఎంపి కిరోడిలాల్ సభలో తెలియజేశారు. గతంలో అనేకమార్లు ఈ బిల్లును ప్రవేశపెట్టాలని చూసినా రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో వదులుకోవలసి వచ్చింది. అయితే, ఇప్పుడు సభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉండటంతో మరోసారి బిల్లును ప్రవేశ పెట్టింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే, మతాలు, ఆచారాలు, సంప్రదాయాలకు అతీతంగా దేశంలో నివశించే పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది.