BJP Mission 2024: బీజేపీ నయా టార్గెట్… ఆ తొమ్మి దీ కీలకం
BJP Strategy on Elections 2024: బీజీపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు న్యూఢిల్లీలోని ఎన్‌డీఎంసీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మొత్తం 9 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఈ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో అనుసరించాల్సిన విధానంపైనే ముఖ్యంగా చర్చించారు. తెలంగాణతో సహా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ఓటమిపాలవ్వకూడదని, దానికోసం ప్రధానంగా బూత్ స్థాయి నుండి బలంగా పనిచేయాల్సి ఉంటుందని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు.
ఏ ఏడాది ఎన్నికలు జరగనున్న 9 రాష్ట్రాల్లో 72 వేల పోలింగ్ బూత్‌లలో బలహీనంగా ఉన్నామని, కష్టపడి పనిచేస్తే తప్పనిసరిగా అక్కడ కూడా బలం పుంజుకుంటామని జేపీ నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోడీ, పార్టీ ఉపాధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఇతర రాష్ట్రాలకు చెందిన సీఎంలు, ఆయా రాష్ట్రాల అధ్యక్షులు పాల్గొన్నారు. గుజరాత్‌లో సాధించిన విధంగానే త్వరలో జరగనున్న 9 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా విజయాలు సాధించాలని జేపీ నడ్డా పేర్కొన్నారు.
ఉచిత రేషన్‌తో సహా అనే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, గతంలో రోజుకు జాతీయ రహదారుల నిర్మాణం 12 కిమీ మేర ఉంటే, ప్రస్తుం అది 37 కిమీలకు చేరిందని అన్నారు. 2024 ఎన్నికల్లో మూడోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి వస్తామని, రాష్ట్రాల్లో కూడా పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇక కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు రాజకీయ తీర్మానాన్ని ప్రశేపెట్టారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానంపైనే ప్రత్యేకంగా చర్చించారు.