గుజరాత్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయిస్తోంది. ఈ సారి కాంగ్రెస్ పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ కూడా గట్టి పోటీ ఇస్తోంది. దీంతో బీజేపీ నాయకులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. టిక్కెట్ల కేటాయింపులో అనేక వడపోతల తర్వాత తొలి జాబితాను విడుదల చేశారు
గుజరాత్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయిస్తోంది. ఈ సారి కాంగ్రెస్ పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ కూడా గట్టి పోటీ ఇస్తోంది. దీంతో బీజేపీ నాయకులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. టిక్కెట్ల కేటాయింపులో అనేక వడపోతల తర్వాత తొలి జాబితాను విడుదల చేశారు. 160 పేర్లను ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బీజేపీ ప్రకటించిన జాబితాలో 14 మంది మహిళలకు స్థానం కల్పించారు. 13 మంది ఎస్సీలు, 24 మంది ఎస్టీలకు కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు.
182 సీట్లు కలిగిన గుజరాత్ అసెంబ్లీకి రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 1న మొదటి విడత ఎన్నికలు జరుగగా, డిసెంబర్ 5న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో 89 స్థానాలకు, రెండో విడతలో 93 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
బీజేపీ ప్రకటించిన 160 మంది పేర్లలో మొదటి విడతలో పోటీ చేసే వాళ్లు 84 మంది ఉండగా, రెండో విడతలో పోటీ చేసే వాళ్లు 76 మంది ఉన్నారు. మిగతా 22 మంది పేర్లను త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గట్లోడియా నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు.