CM Stalin Birthday: నేడు తమిళనాడు సీఎం స్టాలిన్ బర్త్ డే, ప్రధాని మోడీ శుభాకాంక్షలు
Birthday Wishes to Tamil nadu Chief Minister Stalin
తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ రోజు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే కార్యకర్తలు, అభిమానులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రముఖులెందరో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్టాలిన్ కు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి . స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం స్టాలిన్ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు స్టాలిన్ ఆరోగ్యం, ఆనందంగా ఉండాలని, స్టాలిన్ తలపెట్టే పనుల్లో విజయం చేకూరాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
2021లో సీఎం పదవి చేపట్టిన స్టాలిన్
తండ్రి కరుణానిధి నీడలో ఎదిగిన స్టాలిన్ తమిళనాడు రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. తండ్రి అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తూ పార్టీపై పట్టు సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్ ఎదగడంలో కీలక పాత్ర పోషించారు. తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన స్టాలిన్ 2021 ఏప్రిల్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎం పదవి అధిష్టించారు.
Birthday greetings to Tamil Nadu CM Thiru @mkstalin Ji. May he be blessed with a long and healthy life.
— Narendra Modi (@narendramodi) March 1, 2023
My best wishes to Hon’ble Chief Minister of Tamil Nadu, Sri @mkstalin garu, on his 70th birthday.
I wish you good health, happiness and success in this year ahead.#MKStalin70— YS Jagan Mohan Reddy (@ysjagan) March 1, 2023
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె. స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం స్టాలిన్ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
— Telangana CMO (@TelanganaCMO) March 1, 2023
Happy Birthday to our CM Stalin sir..🤩🤩 @mkstalin #HBDMKStalin70 #HBDstalin70 #Stalin #CMMKSTALIN #TamilNadu #stalinbirthday pic.twitter.com/HyiQxvzOyU
— Live Art Chennai (@LiveArtChennai) March 1, 2023
Stalin