Bike Riders : నడిరోడ్డుపై నాగిని డ్యాన్స్ చేస్తున్న యువకులు
Bikers Perform Nagin Dance On Road: ఎడతేరుపని వర్షాలకు జనాలు బయటకురావడానికి జంకుతున్నారు.ఒకవైపు విస్తారంగా వర్షాలు మరోవైపు పొంగిపొర్లుతున్న నదులు,చెరువులు బయట కాలు పెట్టనీయకుండా గత నాలుగురోజులనుండి వానలుదంచికొడుతున్నాయి.ఈ వానలకి యూత్ మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.
కర్నాటకలో కొందరు బైక్ ల మీద వర్షానికి రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వెళుతున్న ఓ ట్రక్కు డ్రైవర్ హారన్ మోగించాడు. ఆ హారన్ నాగిని డ్యాన్స్‌కు సంబంధించింది. దీంతో యువకులు రోడ్డు పక్కనే బైకులను పార్కింగ్ చేసి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఈ తరుణంలో డ్రైవర్‌ను సాంగ్ పెట్టమని అడిగారు ట్రక్కు డ్రైవర్.. శ్రీదేవి నటించిన ‘నగీనా’లోని “మెయిన్ తేరీ దుష్మాన్” సాంగ్‌ను ప్లే చేశాడు.
యువకులు మరింత రెచ్చిపోయారు. రోడ్డు మీద పడుకుని దొర్లుతూ.. డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసారు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.ఈ వీడియోపై నెటిజన్లు పలు ఆసక్తికరమైన కామెంట్స్ పెడుతున్నారు.
मजे है जैसे में आप ले पाओ वैसे लो 🤣#BachelorNation #party #nagindance pic.twitter.com/d0z9zvYsc1
— नटखट निड 🚩 (@natkhatnids) July 12, 2022