Nitish Kumr on BRS: బీఆర్ఎస్ సభపై బీహార్ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు… ఆహ్వానం అందలేదు
Nitish Kumr on BRS Public Meeting: ఇటీవలే తెలంగాణలోని ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభపై బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో తొలి సభను నిర్వహిస్తున్నట్లు తనకు తెలియదని, బీఆర్ఎస్ పార్టీ నుండి తమకు ఎలాంటి అహ్వనం అందలేదని అన్నారు. ఆహ్వానించిన పార్టీలు ఆ సభకు హాజరైనట్లు తెలిపారు. దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలన్నదే తన అభిమతమని, అదే తన కల అనికూడా నితీష్ కుమార్ పేర్కొన్నారు. దేశంలో బీజేపీ ఓడించాలంటే ఇదొక్కటే మార్గమని, ఈ ప్రతిపక్షాల్లో కాంగ్రెస్ కూడా ఉండాలని అన్నారు. కాంగ్రేసేతర ప్రతిపక్షాలతో బీజేపీని ఓడించడం సాధ్యం కాదని నితీష్ కుమార్ చెప్పడం విశేషం.
అయితే, బీఆర్ఎస్ బీజేపీయేతర, కాంగ్రేసేతర పార్టీలతో కూడిన ప్రతిపక్షం ఏర్పాటు చేయాలని చూస్తే తద్వారా బీజేపీని ఓడించడం కష్టం అవుతుందని అన్నారు. అన్ని ప్రతిపక్షాలు కావాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్‌గా మార్చే ప్రతి క్రమంలో కేసీఆర్ కర్ణాటక నేత మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సంప్రదిస్తూనే ఉన్నారు. ఆయన కూడా సలహాలు, సూచనలు ఇస్తూ, హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌తో చర్చిస్తూనే ఉన్నారు. కానీ, తొలి సభకు కుమారస్వామిని కూడా పిలువకపోవడం పలు అనుమానాలకు తావునిస్తోంది. కుమారస్వామి, నితీష్ కుమార్‌లు ఈ సభకు హాజరుకావకపోవడంతో వచ్చే ఎన్నికల్లోనూ ప్రతిపక్షాల ఐఖ్యత మిధ్యేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.