Bhopal: హైదరాబాద్-భోపాల్లో ఇటీవల ఉగ్రకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 19 మందిని భోపాల్ ఏటీఎస్ పోలీసులు (Bhopal ATS police) అరెస్ట్ చేశారు.
Bhopal: హైదరాబాద్-భోపాల్లో ఇటీవల ఉగ్రకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 19 మందిని భోపాల్ ఏటీఎస్ పోలీసులు (Bhopal ATS police) అరెస్ట్ చేశారు. వారందరినీ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ముఖ్యంగా 16 మంది నిందితులను మరింత లోతుగా విచారిస్తున్నారు. ఈక్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిమ్ ట్రైనర్ యసిర్ (Yasir).. యువకులకు ఉగ్ర శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఫిధాయీ దళాల పేరుతో ఉగ్రవాదులు యువకులు ఉగ్ర శిక్షణ ఇచ్చారు. హెచ్యూటీ కోడ్ భాషలో ఫిధాయీ అంటే.. ఆత్మాహుతి దాడి అని ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. భోపాల్లోని భోజ్ పురా సమీపంలోని రసన్ అడవుల్లో యువతకు ఉగ్రవాద కార్యకాలాపాలపై శిక్షణ ఇచ్చినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారి వద్ద పలు వీడియోలు.. కోడ్ భాషల్లో ఉన్న 50కి పైగా ఆడియోలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగా భోపాల్లోని శాంతి ద్వీపం పేల్చేయాలి అని ఉన్న కోడ్ భాషను డీకోడ్ చేశామని వెల్లడించారు.
అలాగే భోపాల్లోని రాణి కమలావతి రైల్వే స్టేషన్, మోతీలాల్ నెహ్రూ స్టేడియం, బరాసియా డ్యాం వద్ద బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ కార్యకలాపాల కోసం విదేశాల నుంచి హవాలా మార్గంలో నిధులు వచ్చినట్లు గుర్తించామని తెలిపారు. నిందితులను మరింత లోతుగా విచారిస్తామని.. మరికొన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకావశం ఉందని భోపాల్ ఏటీఎస్ పోలీసులు పేర్కొన్నారు.