Bhagavad Geeta: సెంట్రల్ సిలబస్‌లో భగవద్గీత
Bhagavad Geeta: దేశంలో ఇక నుంచి సెంట్రల్ సిలబస్‌లో 6, 7 తరగతుల్లో భగవద్గీతను పాఠ్యంశంగా చేరుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం తీసుకుని వస్తున్న నూతన విద్యా విధానంలో భాగంగా ఇక నుంచి భగవద్గీతను బోధించనున్నారు. అంతేకాదు భగవద్గీతలోని శ్లోకాలను 11, 12 తరగతుల్లో సంస్కృత పుస్తకాల్లో పాఠ్యంశంగా చేర్చనున్నట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు.
మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా సిలబస్ లో భగవద్గీతను చేర్చబోతున్నారు. భారతదేశం సంప్రదాయం జ్ఞానాన్ని సూచిస్తుందని, మంత్రి పేర్కొన్నారు. ఇది అందరి సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. ఈ శతాబ్దంలో మనదేశం జ్ఞాన శక్తిగా ఎదగాలంటే, భగవద్గీత.. మహాభారత ఇతిహాసాలను ప్రతిఒక్కరు చదవాలని అన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి సెంట్రల్ సిలబస్ లో భగవద్గీతను తప్పనిసరిగా బోధించనున్నారు. నేటి నవీన మానవ సమాజానికి, ముఖ్యంగా యువత ఉత్తమ వ్యక్తిత్వ, దృడ మానసిక, వ్యవహారిక నిర్మాణానికి, మానవీయ విలువలను అందించేందుకు అవసరమైన భగవద్గీతను సెంట్రల్ సిలబస్ లో పాఠ్యంశంగా చేర్చడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.