BBC Documentary on PM Modi: విమర్శలను పట్టించుకోం… పరిశోధన చేశాకే రూపొందించాం
BBC Defends documentary on PM Modi: ప్రముఖ బీబీసీ ఛానల్ ప్రధాని మోడిని తప్పుపడుతూ గుజరాత్ అల్లర్లపై మరోసారి డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది. గుజరాత్ అల్లర్లకు ప్రధాని మోడీనే ప్రధాన కారణమని చూపే విధంగా డాక్యుమెంటరీని రూపొందించారు. బీబీసీ రూపొందించిన ఈ డాక్యుమెంటరీపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. భారత్‌తో పాటు అటు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా విమర్శించారు. దేశ వ్యాప్తంగా నిరసనలు ఎదురౌతున్నాయి. బీబీసీని భారత్ నుండి బ్యాన్ చేయాలనే విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో బీబీసీ వివరణ ఇచ్చింది.
తాము ఈ విషయంలో లోతైన పరిశోధన చేశామని, కొంతమంది బీజేపీ నేతలను కలిసి వివరాలు అడిగి తెలుసుకొన్న తరువాత మాత్రమే ఈ డాక్యుమెంటరీని రూపొందించామని బీబీసీ ప్రతినిధి తెలియజేశారు. భారత ప్రభుత్వం తమ ప్రశ్నలకు బదులివ్వాలని కూడా పేర్కొన్నారు. కానీ, భారత ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని అన్నారు. 20ఏళ్ల క్రితం ముగిసిపోయిన అల్లర్లను తిరిగి ఈ డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరించి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయమడే లక్ష్యంగా పెట్టుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా బీబీసీ వంటి చానల్ ఇలాంటి అంశాన్ని ఎంచుకోవడం వెనుక యాంటీ ఇండియా వాదన దాగుందని, భారత్ అన్ని రంగాల్లో ప్రపంచ దేశాల కంటే వేగంగా అభివృద్ధి సాధిస్తందని, దీనిని చూడలేకే బీబీసీ వంటి ఛానల్ ఇలాంటి దారుణాలకు పాల్పడుతోందని జాతీయ స్థాయిలో నేతలు విమర్శిస్తున్నారు.