బ్యాంక్ అలర్ట్ : వరుసగా నాలుగు రోజులు సెలవులు!
ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పలు బ్యాంకు యూనియన్లు పిలుపునిచ్చాయి. వాటికి తోడుగా ముందు నాలుగో శనివారం (26), ఆదివారం (27) సెలవులు కావడంతో ఆ రోజుల్లో కూడా బ్యాంకులు మూసి ఉండనున్నాయి. అలా మొత్తం నాలుగు రోజులు బ్యాంకులు మూసి ఉంచనున్నారు. ఇక ఏప్రిల్‌కు సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితాను ఆర్‌బీఐ విడుదల చేసింది. ఈ నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబితా ప్రకారం, ఏప్రిల్ 2022లో 15 రోజుల పాటు బ్యాంకులు మూసి వేయబడతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సెలవుల జాబితా ప్రకారం, బ్యాంకింగ్ సెలవులు వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగలు లేదా ఆ రాష్ట్రాల్లోని ప్రత్యేక సందర్భాలలో కూడా ఉంటాయి. ఈ సెలవులన్నీ అన్ని రాష్ట్రాల్లో వర్తించవు. వివిధ రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సెలవులు వేర్వేరు రోజులు ఉంటాయి.