Bank Strike: సమ్మె సైరెన్ మోగించనున్న బ్యాంక్ ఉద్యోగులు
Bank Strike: దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వివిధ బ్యాంకు ఉద్యోగుల సంఘాలు జనవరి 30, 31న సమ్మె చేయాలని నిర్ణయించాయి. కాబట్టి ఆ రెండు తేదీల్లో బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. రెండురోజుల సమ్మె వల్ల నాలుగు రోజులు బ్యాంకు లు బంద్ ఉండే పరిస్థితి నెలకొంది.
28 వ తేదీ నాలుగవ శనివారం,ఆదివారం తో కలిపి సమ్మె చేసే రెండురోజులు వల్ల మరో రెండురోజులు అంటే నాలుగు రోజులు బ్యాంకు లు మూతబడనున్నాయి. ఇది సామాన్యుడి పై భారం పడనుంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని ఈ విషయాన్ని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఆధ్వర్యంలోని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు. గురువారం ముంబైలో జరిగిన బ్యాంకు ఉద్యోగుల సమావేశంలో సమ్మెపై నిర్ణయం తీసుకున్నారు.
ఐదు రోజుల పని దినాలు, ఎన్‌పీఎస్ రద్దు, వేతనాల పెంపు, ఖాళీల భర్తీ సాధనే లక్ష్యంగా సమ్మెకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ డిమాండ్లపై ఎప్పట్నుంచో పోరాడుతున్నామని, ఎన్నిసార్లు లేఖలు రాసినా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ స్పందించడం లేదంటున్నారు ఉద్యోగులు. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదు. అందుకే మేం నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించాం. జనవరి 30, 31న సమ్మెకు పిలుపునిచ్చాం అని తెలిపారు.