Ayodya temple: శ్రీరాముడి విగ్రహంలో ప్రత్యేకతలు ఇవే…
Ayodhya: వచ్చే ఏడాది జనవరి 1 వ తేదీన అయోద్య రామాలయం నిర్మాణం పూర్తి చేసే విధంగా నిర్మాణం చేపడుతున్నారు. వేగంగా నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరినాటికి గర్భాలయం పనులు కూడా పూర్తి చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 వ తేదీ నాటికి నిర్మాణం పూర్తి చేసి జనవరి 14 వ తేదీన మకర సంక్రాంతి రోజున ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు అయోధ్య ట్రస్ట్ అధికారులు తెలియజేశారు. తొమ్మిది అడుగుల ఎత్తైన గర్భాలయంలో శ్రీరాముడి కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించారు.
ఈ విగ్రహం ప్రత్యేకంగా ఉండాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. గర్భాలయంలో శ్రీరాములవారి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకేలా ఏర్పాటు చేయనున్నారు. విగ్రహం రూపకల్పన కోసం దేశంలోని ప్రముఖ శిల్పులను ఆహ్వానిస్తున్నారు. ఒడిశాకు చెందిన సుదర్శన్ సాహు, వాసుదేవ్ కామత్, కర్ణాటకు చెందిన కెకెవి మానియా, ఫూణేకు చెందిన శత్రయజ్ఞ దేవల్కర్‌లను తుది ఎంపిక కోసం విగ్రహం డ్రాఫ్ట్‌లను పంపాలను ఆలయ ట్రస్ట్ అధికారులు కోరారు. విగ్రహం తయారీ కోసం మహారాష్ట్ర, కర్ణాటక,ఒడిశా రాష్ట్రాలకు చెందిన రాతిని ఎంపికచేయనున్నారు. విగ్రహానికి చెందిన రూపురేఖలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ట్రస్ట్ అధికారులు పేర్కొన్నారు.