తమిళనాడులో దారుణం.. పేలిన ఎలక్ట్రానిక్ బైక్ బ్యాటరీ
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. వేలూరు సమీపంలోని చిన్న అల్లాపురంలో ఎలక్ట్రానిక్ బైక్ బ్యాటరీ పేలింది. బైక్ బ్యాటరీకి రాత్రి ఛార్జింగ్ పెట్టిన వ్యక్తి… దానిని తీయకుండా పడుకున్నాడు. దీంతో అర్థరాత్రి బ్యాటరీ పేలడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. ఇళ్లంతా పొగలు అలుముకోవడంతో ఊపిరాడక తండ్రీ, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు.
భారీ శబ్దం రావడంతో స్థానికులు ఒక్క సారిగా బయటకు వచ్చి చూశారు. ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున పొగలు వస్తుండటంతో భయాందోళనకు గురైన స్థానికులు.. ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి ఉంచడం వల్ల ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.