BJP Profit: బీజేపీకి భారీ ఆదాయం… ఒక్క ఏడాదిలో
BJP Profit: ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ ఆదాయం విషయంలోనూ టాప్ లో నిలిచింది. ఆ పార్టీకి 2021-22 సంవత్సరంలో రూ. 1161 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తెలియజేసింది. మొత్తం ఏడు జాతీయ పార్టీల ఆధాయంలో ఇది 53.45 శాతంగా ఉన్నట్లు ఏడీఆర్ తన నివేదికలో పేర్కొన్నది. దేశంలోని ఏడు ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, ఎన్‌పీపీల ఆదాయం మోత్తం రూ. 2,172 కోట్లుగా పేర్కొన్నది. ఇందులో బీజేపీకి 1161 కోట్లు సమకూరగా, టీఎంసీకి రూ. 528 కోట్లు సమకూరినట్లు ఎడీఆర్ తెలియజేసింది. జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో 66 శాతం ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లభించగా, మిగతా మొత్తం అజ్ఞాత వ్యక్తులు, సంస్థలు ఇచ్చిన విరాళాలేనని ఏడీఆర్ తెలియజేసింది. జాతీయ పార్టీలు ఇచ్చిన వార్షిక ఆడిట్ నివేదికల ఆధారంగా ఈ రిపోర్ట్‌ను తయారు చేసినట్లు ఏడీఆర్ తెలియజేసింది.
ఇలా అందిన ఆదాయాన్ని ఆయా పార్టీలు పార్టీ ప్రచారం కోసం, ఎన్నికల నిర్వహణ కోసం వినియోగిస్తుంటారు. పార్టీ తరపున నిర్వహించే కార్యక్రమాల కోసం ఈ నిధులను వెచ్చిస్తుంటారు. పార్టీ నడిపేందుకు అవసరమైన వాటి కోసం ఈ డబ్బును ఖర్చు చేస్తుంటారు. పార్టీలు ఖర్చు చేసిన డబ్బును ఆడిట్‌లకు సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది పార్టీలకు వచ్చిన ఆదాయం చేసిన ఖర్చులను ఆడిట్ రూపంలో ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.