Liquor scam case : లిక్కర్ కేసులో కీలక పరిణామం.. వారి ఆస్తులు జప్తు!
Liquor scam case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో కొన్ని ఆస్తులను ఎటాచ్ చేసింది. ఈ కేసులో ఉన్న సమీర్ మహేంద్రుకు చెందిన ఇళ్లు, దినేష్ అరోరా రెస్టారెంట్, విజయ్ నాయర్ ఇల్లు ఎటాచ్ చేశారని అంటున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరికీ సంబంధించిన ఆస్తులు ఎటాచ్ చేశారని అంటున్నారు. ఇక నిజానికి ఈ కేసులో కొందరు నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్రులకు బెయిల్ మంజూరు చేస్తూ కొద్దిరోజుల క్రితమే కోర్టు నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది అధికార పార్టీ నేతల పేర్లు ఉండడం వారికి నేరుగా సంబంధాలు ఉండటం, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తులు అరెస్ట్ కావడంతో.. ఇక్కడ కూడా ఆ కేసు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిల పేర్లు ఈ కేసులో వినిపించగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తులను ఈ కేసులో సీబీఐ, ఈడీ అరెస్ట్ చేశాయి