ASER 2022 Report: పాఠశాలల్లో దిగజారుతున్న విద్యా ప్రమాణాలు, కారణాలు ఇవేనా?
ASER report 2022 finds faults in the our educational institutions
PAN నెట్ వర్క్, ప్రథమ్ ఫౌండేషన్ చేసిన వార్షిక విద్యా సర్వేను అనేక మంది విద్యా వేత్తలు పరిశీలిస్తున్నారు. ఆ సర్వేలోని గణాంకాల ఆధారంగా తమ తమ స్పందనను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. డాక్టర్ రంజన్ కుమారీ అనే విద్యావేత్త కూడా విద్యా సర్వేలోని కొన్ని గణాంకాలను ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.
ASER నివేదిక ప్రకారం దేశంలో 23.9 శాతం పాఠశాలల్లో త్రాగునీటి సౌకర్యం లేదు. 23.9 శాతం పాఠశాలల్లో శానిటరీ యూనిట్లు లేనే లేవు. 21.7 శాతం పాఠశాలల్లో అసలు లైబ్రరీ సౌకర్యమే లేదు. ఇక కంప్యూటర్ల విషయానికి వస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మన దేశంలోని పాఠశాలల్లో 77.3 శాతం పాఠశాలల్లో కంప్యూటర్ అనేదే లేదు.
This is ASER Government 2022 report “no drinking water in 23.9% percent schools,No sanitation units in 23.9% , 21.7%schools have no library and 77.3%school in the country have no Computers.@MinistryWCD pic.twitter.com/VTt8hG8phu
— Dr. Ranjana Kumari (@ranjanakumari) January 20, 2023
దేశంలోని పాఠశాలల్లో కంప్యూటర్ గణాంకాలను పరిశీలిస్తే 2028లో 45.5 శాతం ఉన్న ఈ సంఖ్య 2022 నాటికి 33 శాతానికి పడిపోయింది. పాఠశాలల సంఖ్య, విద్యార్ధుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతున్నా తదనుగుణంగా కంప్యూటర్ల సంఖ్య పెరగడం లేదు.
పాఠశాల విద్యకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వకపోతే భవిష్యత్తు తరాల వారు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. సమాజానికి భారంగా మారతారు. సరైన స్కిల్స్ లేక నిరుద్యో్గులుగా మిగిలిపోతారన విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.