రేపటి నుంచి బ్యాంకులకు వరుస సెలవులు.. ఎందుకంటే?
రేపటి నుంచి బ్యాంకులకు వరుస సెలవులు ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు వరుసగా 5 రోజులు సెలవులు ఉన్నాయి. సో, బ్యాంక్ లో ఏదైనా పని ఉంటే.. ఈలోపే పూర్తి చేసుకోవడం ఉత్తమం. బ్యాంకు సెలవులు వివరాలు ఈ మేరకు ఉన్నాయి. ఏప్రిల్ 1 – యాన్యువల్ క్లోజింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ (అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు), ఏప్రిల్ 2- ఉగాది, ఏప్రిల్ 3- ఆదివారం, ఏప్రిల్ 4 – సర్హుల్ (రాంచీలో బ్యాంక్ సెలవు), ఏప్రిల్ 5- బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు కారణంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో బ్యాంక్ హాలిడే ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2022 నుండి ప్రారంభం కానుంది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు బ్యాంకుల్లో పబ్లిక్ డీలింగ్ ఉండదు. దీంతో పాటు ఈ నెలలో వివిధ ప్రాంతాల్లో మొత్తం 30 రోజులకు గాను 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయని అంటున్నారు.