Amit Shah: అదానీ వివాదంపై పెదవి విప్పిన అమిత్ షా
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అదానీ వివాదంపై తొలిసారి పెదవి విప్పారు. అదానీ అంశంపై అమిత్ షా బహిరంగంగా మాట్లాడారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు న్యాయంగా పనిచేస్తున్నాయని, రెండు కేసులు మినహా అన్ని కేసులు యూపీఏ ప్రభుత్వ హయాంలో నమోదైనవేనని షా అన్నారు. శుక్రవారం జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో షా మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతల ఆరోపణలన్నీ నిరాధారమైనవని, దర్యాప్తు సంస్థల పని తీరుపై అనుమానం ఉంటే కోర్టుల్లో సవాలు చేయవచ్చని అన్నారు. అదానీ గ్రూప్‌పై విచారణ గురించి అడిగిన ప్రశ్నకు, షా మాట్లాడుతూ, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతో ఇద్దరు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రతి ఒక్కరూ వెళ్లి తమ వద్ద ఉన్న ఆధారాలు సమర్పించాలని అన్నారు. ఏదైనా తప్పు జరిగితే ఎవరినీ విడిచిపెట్టేది లేదని అన్నారు. న్యాయ ప్రక్రియపై అందరికీ విశ్వాసం ఉండాలి. నిరాధార ఆరోపణలు చేయవద్దని, అవి ఎక్కువ కాలం సాగవని అమిత్ షా అన్నారు. అలాగే ఏక కాలంలో రెండు దర్యాప్తులు జరుగుతున్నాయన్నాని ఆయన పేర్కొన్నారు.