ఈ నెల 28వ తేదీన జరగనున్న కొత్త పార్లమెంట్ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యే ప్రసక్తే లేదని విపక్షాలు తేల్చి చెప్పాయి. సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ నిర్ణయంపై కేంద్రహోం మంత్రి అమిత్ షా ఘాటుగా స్పందించారు. పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాజకీయం చేయొద్దని విపక్షాలకు హితవు పలికారు.
Amit shah Denounces opposition parties for Boycotting New Parliament inauguration
ఈ నెల 28వ తేదీన జరగనున్న కొత్త పార్లమెంట్ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యే ప్రసక్తే లేదని విపక్షాలు తేల్చి చెప్పాయి. సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ నిర్ణయంపై కేంద్రహోం మంత్రి అమిత్ షా ఘాటుగా స్పందించారు. పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాజకీయం చేయొద్దని విపక్షాలకు హితవు పలికారు.
కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టికి నిదర్శనమని అమిత్ షా అన్నారు. మే 28వ తేదీన ప్రధాని ఈ భవనాన్ని దేశానికి అంకితం చేయనున్నారని, దాదాపు 60 వేల మంది కార్మికుల శ్రమతో కట్టిన భవనమిదని అమిత్ షా గుర్తుచేశారు. కొత్త పార్లమెంట్ భవనం చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమంలోనే ఆ కార్మికులందరినీ ప్రధాని మోదీ సత్కరిస్తారని అమిత్ షా తెలిపారు.
కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంపై 19 విపక్ష పార్టీల కీలక నిర్ణయం
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈనెల 28న జరగనుంది. ఈ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు విపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని విపక్షాలు భావిస్తున్నాయి. పార్లమెంటుకు ఆత్మ వంటి ప్రజాస్వామ్యానికే చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఇక ఎలాంటి విలువా లేదని పేర్కొంటూ 19 విపక్ష పార్టీలు బుధవారంనాడు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి..
ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్న 19 పార్టీలు ఇవే.
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బష్కరిస్తున్నట్టు ప్రకటించిన 19 పార్టీల్లో కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన (యూబీటీ), సమాజ్వాదీ పార్టీ, సీపీఐ, జార్ఖాండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుదలై చిరుతైగళ్ కట్చి, రాష్ట్రీయ లోక్ దళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), ఎన్సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఇండియన్ యూనయన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషరీ సోషలిస్ట్ పార్టీ, ఎండీఎంకే ఉన్నాయి.