Urination Horror: మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై మూత్ర విజర్జన, అమెరికా విమానంలో ఘటన
American Airline Flyer Urinated on Fellow Passenger
విమానాల్లో మూత్ర విసర్జన సంఘటనలు ఇటీవల కాలంలో సాధారణంగా మారాయి. తాగిన మైకంలో ఒళ్లు మరిచి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. సాటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. విమాన సిబ్బందితో గొడవలు పడుతున్నారు. ఇటువంటి సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ కావడంతో విమాన ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమాన సిబ్బంది ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా ఇటువంటి మరో సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.
న్యూయార్క్ నుంచి న్యూ ఢిల్లీ వెళుతున్న విమానంలో ఈ ఘటన జరిగింది. మద్యం సేవించిన ఓ యువకుడు తోటి ప్రయాణికుడిపై మూత్రం విసర్జించాడు. ఈ పని చేసిన యువకుడు అమెరికా యూనివర్సిటీలో చదువుతున్నట్లు తెలిసింది. దీంతో అతడి చదవు పాడవుతుందని భావించిన సాటి ప్రయాణికుడు ఫిర్యాదు చేయడానికి నిరాకరించారు. విమాన సిబ్బంది మాత్రం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి సమాచారం అందించింది. అప్రమత్తమైన సిబ్బంది విమానం ఢిల్లీలో ల్యాండ్ అవగానే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
కఠిన చర్యలు తీసుకునే అవకాశం
విమానయాన శాఖ నిబంధనల ప్రకారం ఇటువంటి సంఘటనపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిందితులపై క్రిమినల్ కేసులు కూడా పెట్టే ఛాన్స్ ఉంది. అదే విధంగా కొంత కాలపం పాటు వీరిని విమానాల్లో ప్రయాణం చేయకుండా బ్యాన్ కూడా చేసే అవకాశం ఉంది.
సాటి ప్రయాణికుడికి క్షమాపణలు
మద్యం సేవించిన యువకుడు నిద్రావస్థలోకి జారుకున్నాడు. ఆ సమయంలో మూత్ర విసర్జన కావడంతో సాటి ప్రయాణికుడిపై ఇబ్బంది కలిగింది. వెంటనే తేరుకున్న విద్యార్ధి తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. సాటి ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పాడు. దీంతో ఫిర్యాదు చేయకూడదని బాధితుడు నిర్ణయించుకున్నాడు.