Amaranth Yatra: పున:ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర
Amaranth Yatra: గత రెండేళ్లుగా కరోనా కారణంగా అమర్నాథ్ యాత్రకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయలేదు. కరోనా కంట్రోల్ కావడంతో ఈ ఏడాది యాత్రకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. లక్షల సంఖ్యలో భక్తులు అమర్నాథ్ యాత్రకు సిద్ధం అయ్యారు. అయితే, శుక్రవారం రోజున ఆకస్మికంగా భారీ వర్షాలు కురవడంతో యాత్రికులు బస చేసిన ప్రాంతంలో వరద పోటెత్తింది. ఆకస్మికంగా వరద పోటెత్తడంతో 16 మంది యాత్రికులు మృతి చెందారు. యాత్రికులు బస చేసిన ప్రాంతాలన్నీ పూర్తిగా పరిశీలించిన తరువాతే అనుమతులు ఇచ్చామని, కానీ, అకస్మాత్తుగా వరదలు సంభవించడంతో ముప్పు వాటిల్లిందని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ కార్యాలయం పేర్కొన్నది.
పరిస్థితులు చక్కబడటంతో అమర్నాథ్ యాత్రను సోమవారం రోజున తిరిగి ప్రారంభించారు. జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి 4020 మంది యాత్రికులు 110 వాహనాల్లో బేస్ క్యాంపుకు బయలుదేరారు. వీరంతా మంగళవారం రోజున అమర్నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకొనున్నారని గవర్నర్ కార్యాలయం తెలియజేసింది. యాత్రికులకు యాత్రకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సైనికులు నిత్యం పర్యవేక్షిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.