Political Leaders under PMLA : రాజకీయా నేతలంతా పీఎంఎల్ఏ పరిధిలోకే
Political Leaders under PMLA : కేంద్ర ఏజెన్సీ సంస్థ ఈడీకి కేంద్ర ప్రభుత్వం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. రాజకీయ నేతలందర్నీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కిందకు తీసుకొచ్చింది. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు జరిపే ఆర్థిక లావాదేవీలను ఈ పీఎంఎల్ఏ పరధితోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణల ప్రకారం, బ్యాంకులు ఆర్థిక సంస్థలు రాజకీయ, స్వచ్చంద సంస్థల ఆర్టిక లావాదేవీలను రికార్డ్ చేయవలసి ఉంటుంది. రాజకీయ, ప్రభుత్వనేతలు, సీనియర్ నాయకులు, సీనియర్ ప్రభుత్వ, న్యాయ, మిలిటరీ అధికారులు, రాజకీయాలకు సంబంధించిన ముఖ్యనేతలు ఇకపై పీఈపీ కిందకు వస్తారు.
వీరికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. అవసరం అనుకుంటే వాటిని ఈడీకి అందించాల్సి ఉంటుంది. ఐదేళ్లకు సంబంధించిన లావాదేవీల సమాచారాన్ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్వచ్చంద సేవా సంస్థలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కూడా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రికార్డ్ చేయాలి. ఈ రికార్డులను అవసరం అనుకుంటే ఈడీకి అందించాల్సి ఉంటుంది. ఈడీకి మరిన్ని అధికారాలు కట్టబెట్టడంతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.