Bank Holidays: ఐదు రోజులు మూతపడనున్న బ్యాంకులు
Bank Holidays: రిచ్చెస్ట్ మాన్ నుండి సామాన్య మానవుని వరకు ప్రతి రోజు బ్యాంకు లావాదేవీల తో అనుబంధం ఉంటుంది. వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్తుంటారు. అలాంటి వారు బ్యాంకుల సెలవులు అనగానే ఏంటి పరిస్థితి అనేలా మారింది ప్రస్తుత పరిస్థితి. ఈ నెల 26 నుంచి, నెలాఖరు వరకు 5 రోజుల పాటు బ్యాంకు కు సెలవులు రానున్నాయి. 27వ తేదీన బ్యాంకులు పని చేస్తాయి. తర్వాత 28వ తేదీన నాలుగో శనివారం, 29న ఆదివారం కావడంతో సెలవు ఉంటుంది.
తర్వాత బ్యాంక్ ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మెకు వెళ్లనున్నారు. జనవరి 30-31 తేదీల్లో అఖిల భారత బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చారు. బ్యాంకు ఉద్యోగుల ఆరు అంశాల డిమాండ్లపై ఈ సమ్మె జరగనుంది. జనవరి 26 నుంచి 31 మధ్య, బ్యాంకులు పనిచేయవు జనవరి 27న కేవలం ఒక రోజు మాత్రమే తెరిచి ఉంటుంది. 27వ తేదీ తర్వాత వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.