Mamata Banerjee – Akhilesh Yadav: బెంగాల్ సీఎం మమతతో అఖిలేశ్ భేటీ
Mamata Banerjee – Akhilesh Yadav: కాంగ్రెస్ లేని మరో కూటమికి రంగం సిద్ధమవుతోందని తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ దిశగా చర్చలు జరుపుతున్నారు. నిన్న ఈ ఇద్దరు నేతలు సమావేశమై కాంగ్రెస్, బిజెపియేతర కూటమిపై చర్చలు జరిపారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ప్రతిపక్షాలకు నాయకుడిగా చూపించడం ద్వారా లబ్ధిపొందాలని బిజెపి చూస్తోందన్న విమర్శల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ఈ నెల 23న ఒడిశా ముఖ్యమంత్రి బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌తో మమత భేటీ కానున్నారు.
బిజెపిని ఎదుర్కొనే సత్తా ప్రాంతీయ పార్టీలకు ఉందన్న అఖిలేష్ యాదవ్ .. ఈ కొత్త కూటమిని తాము థర్డ్ ఫ్రంట్‌గా పిలవబోమని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ను ప్రతిపక్షాలకు నాయకుడిగా చూపాలని బీజేపీ ప్రయత్నిస్తోందని.. దాన్ని అడ్డుకొనే వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. బీజేపీ తీర్థం తీసుకున్న వారికి సీబీఐ, ఈడీ, ఐటీలతో ఎలాంటి ఇబ్బంది ఉండదని పరోక్షంగా విమర్శలు చేసారు. బెంగాల్‌లో తాము దీదీతో ఉన్నామన్నారు.