Air India Key Decision on Liquor: మద్యంపై ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
Air India Key Decision on Liquor: ఎయిర్ ఇండియా సంస్థకు వరస దెబ్బలు తగులుతున్నాయి. ఎయిర్ ఇండియా ప్రయాణికులకు అంతర్జాతీయ సౌకర్యాలు కల్పిస్తున్నది. ఫ్లైయిట్లో మద్యం సేవించేందుకు అనుమతులు కూడా ఇస్తున్నది. ఈ నిర్ణయమే ఎయిర్ ఇండియా సంస్థ రెండుమార్లు జరిమానా కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్యారిస్ నుండి ఢిల్లీ వస్తున్న విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనకు సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలని డీసీజీఏ కోరినప్పటికీ ఎయిర్ ఇండియా సంస్థ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో రూ. 10 లక్షల జరిమానా విధించింది. అదేవిధంగా, న్యూయార్క్ నుండి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటనపై కూడా డిజీసీఏ రూ. 30 లక్షల జరిమానా విధించింది.
వరసగా రెండుమార్లు జరిమానాలు పడటంతో ఎయిర్ ఇండియా సిబ్బందికి సదరు సంస్థ కొన్ని సూచనలు చేసింది. ఇకపై ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు పరిమితికి మించి మద్యం ఇవ్వకూడదని నిర్ణయించింది. ప్రయాణికులు పరిమితికి మించి తీసుకుంటున్నారని సిబ్బంది నిర్ణయిస్తే వారికి మద్యం ఇవ్వకుండా నిలిపివేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, వారితో దురుసుగా వ్యవహరించకుండా సావధానంగా మాట్లాడాలని తెలియజేసింది. ప్రయాణికులు బయటనుండి తెచ్చుకున్న మద్యాన్ని సేవించే విషయంలో కూడా సిబ్బంది జాగ్రత్తలు వహించాలని ఎయిర్ ఇండియా సంస్థ తెలియజేసింది.