Central Govt Suggestion to States: కరోనా కట్టడికి చర్యలు తీసుకోండి
Central Govt Suggestion to States: ప్రపంచ దేశాలను రెండేళ్లపాటు గడగడ వణికించిన కరోనా మరలా విజృంభించేందుకు సిద్దమౌతున్నది. దేశంలో ఒకవైపు ఇన్‌ఫ్లూయోంజా వైరస్‌తో పాటు కరోనా కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఫ్లూతో కలిసి కరోనా విజృంభిస్తే దాని పర్యావసానం తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో సహా ఆరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పేర్కొన్నది.
ఉన్నట్టుండి కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఒక్కసారిగా కేసులు పెరగడం ప్రమాదమని తెలియజేసింది. కరోనా కట్టడికి గతంలో తీసుకున్న చర్యలను మరలా అమలు చేయాలని తెలియజేసింది. పాజిటివిటీ రేటు మరలా పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. తెలంగాణలోనూ పాజిటివిటీ రేలు మరలా 1 దాటింది. కొత్తగా 54 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 700లకు పైగా కేసులు నమోదయ్యాయి. టెస్టులను పెంచాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అవసరమైతే వ్యాక్సినేషన్ ప్రక్రయను కూడా వేగవంతంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.