Kerala: కేరళలో కొత్త వ్యాధుల కలకలం..ఏకంగా 300 జంతువులను…
Kerala African Swine flue: కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోకముందే ఇప్పుడు మంకీపాక్స్ భయపెడుతున్నది. ఈ వ్యాధి మెల్లిగా దేశంలో వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్న పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కేరళ, ఉత్తర ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. కరోనా, మంకీపాక్స్ తో పాటు కేరళ రాష్ట్రంలో ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వ్యాధి విస్తరించడం మొదలుపెట్టింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలి లోనూ ఆఫ్రికన్ స్వైన్ కేసు నమోదైంది. మిజోరం, త్రిపుర, అస్సాం తర్వాత ఇప్పుడు బరేలీలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసు నమోదైందని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధికారులు పేర్కొన్నారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలోని మనంతవాడి ప్రాంతంలోని రెండు పందుల పెంపకం కేంద్రాల్లోని పందులకు స్వైన్ ఫ్లూ సోకింది. మొదట ఒక కేంద్రంలోని రెండు పందులకు స్వైన్ ఫ్లూ సోకి మృతి చెందాయి. దీంతో రెండో కేంద్రంలోని పందుల శాంపిల్స్ తీసి మధ్యప్రదేశ్ లోని జంతు పరిశోధన కేంద్రానికి పంపగా స్వైన్ ఫ్లూ ఆనవాళ్లు ఉన్నట్లుగా నిర్ధారించారు. దీంతో ఆ కేంద్రంలోని 300 పందులకు చంపి వేయాలని అధికారులు ఆదేశించారు. వానాకాలం ప్రారంభం కావడంతో వాతావరణ మార్పులతో అనేక జంతువులు వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నాయి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది పెంపుడు పందులను ప్రభావితం చేసే అంటువ్యాధి మాత్రమే అని ఈ వైరస్ పందుల నుంచి మనుషులకు సోకే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు.