Parliament: పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
Parliament: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కాసేపటికే ఉభయ సభల్లో గందరగోళం తలెత్తింది. పార్లమెంట్‌లో రెండో విడత బడ్జెట్ సమావేశాలు మొదలైన కాసేపటికీ రెండు సభలనూ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు స్పీకర్. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. యూకేకు వెళ్లి అక్కడ భారత్ గురించి తక్కువ చేసి మాట్లాడతారా అంటూ మండి పడ్డారు. యూకేలో భారత్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు బీజేపీ పార్లమెంట్ సభ్యులు.
రాహుల్ గాంధీ విదేశీ టూర్‌పై కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు లోక్‌సభలో వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. యూకేలో భారత్‌పై చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన ఆమె..రాహుల్‌ను దేశం నుంచి తరిమేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. పరాయి దేశంలో మన దేశాన్ని కించపరుస్తూ మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉభయ సభల్లో గందరగోళం నెలకోవడంతో రెండుగంటలకు సభ వాయిదా వేశారు.