Delhi New Ministers: ఢిల్లీకి ఇద్దరు కొత్త మంత్రులు.. ఎవరంటే?
Delhi New Ministers: ఆప్ సీనియర్ నేతలు మనీష్ సిసోడియా , సత్యేందర్ జైన్ రాజీనామా తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్, ఎమ్మెల్యే అతిషి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు . ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఇరువురు నేతలతో ప్రమాణం చేయించారు. అతిషికి విద్యా శాఖబాధ్యతలు, సౌరభ్ భరద్వాజ్‌కు ఆరోగ్య మంత్రిత్వ శాఖను అప్పగించారు. దీనితో పాటు, అతిషికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, ఎనర్జీ డిపార్ట్‌మెంట్ మరియు టూరిజం శాఖలను కూడా అప్పగించారు. అదే సమయంలో సౌరభ్ భరద్వాజ్‌కు ఆరోగ్యంతో పాటు పట్టణాభివృద్ధి, నీరు, పరిశ్రమల బాధ్యతలు అప్పగించారు.
మంగళవారం ఢిల్లీ కేబినెట్‌లో అతిషి మరియు సౌరభ్ భరద్వాజ్‌లను నియమించడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇద్దరు నేతలను కేబినెట్‌లో చేర్చుకునే ప్రతిపాదనను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు సీఎం కేజ్రీవాల్ పంపగా, దానిని ఆమోదించి రాష్ట్రపతికి పంపారు. ఇక కొద్దిరోజుల క్రితం ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను 8 గంటల పాటు విచారించిన తర్వాత సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత సిసోడియాను సీబీఐ కస్టడీకి తరలించారు.
దీంతో మంత్రి పదవికి సిసోడియా రాజీనామా చేశారు. సిసోడియాతో పాటు సత్యేందర్ జైన్ కూడా రాజీనామా చేశారు. సీబీఐ కస్టడీ ముగియడంతో సిసోడియాను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. సిసోడియా, జైన్‌లు రాజీనామా చేసిన తర్వాతే సౌరభ్ భరద్వాజ్, అతిషిలను కేబినెట్‌లో చేర్చుకున్నారు. సిసోడియాను మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. సిసోడియా, జైన్‌లు తీహార్ జైలులో ఉన్నారు. సిసోడియా భద్రతకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నుండి కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.