President Elections: మరో రెండు రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికలు, యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ
AAP Extended Support to Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. పొలిటికల్ ఎడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ద్రౌపది ముర్మును కూడా తాము గౌరవిస్తామని, కానీ ఈ సారి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకే తాను మద్దతు పలుకుతున్నట్లు సంజయ్ సింగ్ తెలిపారు.
పొలిటికల్ ఎడ్వైజరీ కమిటీ సమావేశానికి ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, పంజాబ్ ఎంపీ రాఘవ్ చద్దా, ఎమ్మెల్యే అతిషి తదతరులు హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై వీరంతా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు.
AAP के राष्ट्रीय संयोजक व दिल्ली के मा.मुख्यमंत्री @ArvindKejriwal जी की अध्यक्षता में पार्टी PAC की बैठक हुई।
PAC ने राष्ट्रपति चुनाव में विपक्ष के उम्मीदवार श्री यशवंत सिन्हा जी का समर्थन करने का निर्णय लिया है।
हम श्रीमती द्रोपदी मुर्मू का भी सम्मान करते हैं। pic.twitter.com/ViZAUw82QS— Sanjay Singh AAP (@SanjayAzadSln) July 16, 2022
జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు
జూలై 18న జరిగే ఎన్నికలో 4809 మంది ఎలక్టర్లు పాల్గొంటారు. వీరిలో 776 మంది ఎంపీలు కాగా..4033 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంపీలలో 233 మంది రాజ్యసభ ఎంపీలు కాగా..543 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. ఎంపీలందరూ పార్లమెంట్ ప్రాంగణంలో ఓటు చేయనున్నారు. ఎమ్మెల్యేలు తమ తమ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఫలితాలపై అభ్యంతరాలుంటే..
రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే…ఫలితాలు వచ్చిన నాటి నుంచి 30 రోజుల లోగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో ఎవరైనా 20 మంది పిటిషనర్లుగా కలిసి సుప్రీంకోర్టు తలుపు తట్టవచ్చు.
ఎన్నికల బరిలో ఇద్దరే ఇద్దరు
1997లో జరిగిన 11వ రాష్ట్రపతి ఎన్నికల సమయం నుంచి ఎన్నికల బరిలో కేవలం ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. ఎన్నికల నిబంధనలు కఠిన తరం చేయడంతో విజయావకాశాలు లేని వారు పోటీకి దిగడం మానేశారు.
జూలై 21న కౌంటింగ్
జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. జూలై 21న కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. అదే రోజున భారత కొత్త రాష్ట్రపతి ఎవరో తెలియనుంది. ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. జూలై 25న కొత్త రాష్ట్రపతి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.