వివాదాస్పద ఘటనలతో ఢిల్లీ మెట్రో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. ఇటీవల ఓ ప్రయాణికురాలు తోటి ప్రయాణికురాలిపై పెప్పర్ స్ప్రే చల్లింది. అంతకంటే ముందు ఇద్దరు ప్రేమికులు మెట్రోలో అసభ్యకరమైన చేష్టలకు పాల్పడి వైరల్‌గా మారారు.
Delhi Metro: వివాదాస్పద ఘటనలతో ఢిల్లీ మెట్రో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. ఇటీవల ఓ ప్రయాణికురాలు తోటి ప్రయాణికురాలిపై పెప్పర్ స్ప్రే చల్లింది. అంతకంటే ముందు ఇద్దరు ప్రేమికులు మెట్రోలో అసభ్యకరమైన చేష్టలకు పాల్పడి వైరల్‌గా మారారు. అసభ్యకరమైన డ్యాన్సులు చేయడం.. మెట్రోలో ముద్దులు పెట్టుకోవడం.. రీల్స్ చేయడం వంటి ఘటనలతో ఢిల్లీ మెట్రో ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరలవుతూనే ఉంటుంది. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నప్పటికీ.. అటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం ఢిల్లీ మెట్రోకు సంబంధించి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బస్సులు, రైళ్లు, మెట్రోల్లో మహిళా కంపార్ట్మెంట్లలోకి పురుషులకు అనుమతి ఉండదు. కానీ ఢిల్లీ మెట్రోలోని లేడీస్ కోచ్‌లోకి ఓ ప్రయాణికుడు వెళ్లాడు. దీంతో ఓ యువతి అతడిని ప్రశ్నించింది. ఇది లేడీస్ కోచ్ అని.. ఎందుకు వచ్చామని నిలదీసింది. ఆ కోచ్ నుంచి వెళ్లి పోవాలని హెచ్చరించింది. ఆ క్రమంలో యువకునికి తోడుగా వచ్చిన మరో మహిళ.. ఆ యువతి పట్ల దురుసుగా ప్రవర్తించింది. యువతిని బూతులు తిట్టింది. కొట్టేందుకు వెళ్లగా.. పక్కనే ఉన్నవాళ్లు ఆమెను అడ్డుకున్నారు.
ఆ తర్వాత సదరు యువతి మెట్రో అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మెట్రో అధికారులు సదరు యువకుడితో పాటు.. ఆమెకు తోడుగా వచ్చిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను దురుద్దేశంతో ఆ కోచ్‌లోకి వెళ్లలేదని.. తనతో వచ్చిన మహిళకు తోడుగా మాత్రమే ఆ కోచ్‌లోకి వెళ్లానని పేర్కొన్నాడు. ఈ తతంగాన్ని అంతా కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Kalesh b/w Ladies and a Guy over He Stepped up Into ladies Coach in Delhi Metro pic.twitter.com/wzks795oqW
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2023