Jallikattu: జల్లికట్టులో యువకుడి మృతి.. తిరుపత్తూరు లో తీవ్ర ఉద్రిక్తత
Jallikattu: సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్ లో కోడి పందాలు ఎలాగో తమిళనాడులో జల్లికట్టు క్రీడ అలాగ. జల్లికట్టులో పాల్గొనేవారు రంకెలేస్తూ దూసుకొస్తున్న ఎద్దును వీలైనంత ఎక్కువ సేపు పట్టుకుని, దానిని నియంత్రించేందుకు ప్రయత్నించాలి. ఇదొక సాహసోపేతమైన క్రీడ. జంతువులను ఇలా హింసించకూడదం కొందరు కోర్ట్ మెట్లక్కిన కూడా ఈ ఆటమాత్రం ఆగడంలేదు.
జల్లికట్టు నిర్వాహణపై పోలీసులు ఆంక్షలు ఉన్నప్పటికీ.. నిర్వాహకులు వాటిని లెక్కచేయకుండా నిర్వాహకులు, స్థానికులు జల్లికట్టు పోటీలను విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా జల్లికట్టు ఆటలో విషాదం చోటు చేసుకుంది. దాదాపు అరవై మందికి పైగా గాయాలయ్యాయి. పది మంది పరిస్థితి విషమంగా ఉంది. ఒకరు మృతిచెందారు.
తిరుపత్తూరు లో జిల్లాలో నాట్రపల్లి లో జరిగిన జల్లికట్టు లో ఓ యువకుడు మృతి చెందాడు. దీంతో ఈ సంఘటనకు కారణం పోలీసులే అని గ్రామస్తులు తిరగబడ్డారు. పోలీసులపై దాడి చేసారు. గ్రామస్తుల దాడిలో పోలీసులకు గాయాలయ్యాయి. సంఘటన జరిగిన ప్రాంతంలో భారీగా పొలిసు బలగాలు రంగంలోకి దిగాయి. ఇక అక్కడక్కడ జరిగిన జల్లికట్టు పోటీల్లో ఇప్పటికే ఐదుగురు చనిపోయారని సమాచారం అందుతుంది. సంక్రాంతి సందర్భంగా ఆడే ఆట కావడంతో వేలాది మంది ఇక్కడకు వచ్చి ఆటలో పాల్గొంటారు. వేల సంఖ్యలో వచ్చి ఈ ఆటను చూస్తుంటారు. అప్పుడప్పుడు వారికీ కూడా తీవ్రగాయాలైన సందర్భాలున్నాయి.