Ayodhya Ram Temple: అయోధ్య రాముని విగ్రహానికి కర్కాలా నుంచి శిల తరలింపు
A huge rock has been dispatched from Karkal to Ayodhya
కర్ణాటకలోని కర్కాలా ప్రాంతం ప్రస్తుతం ఎంతో సందడిగా మారింది. అయోధ్యలోని రాముని విగ్రహానికి ఉడిపి జిల్లాలోని కర్కాలా నుంచి భారీ శిలను తరలించారు. ఈ తరలింపుకు ముందు భజరంగ్ దళ్ కార్యకర్తలు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పూజలు నిర్వహించారు. కర్ణాటక సాంస్కృతిక మంత్రి వి. సునీల్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నెల్లికారు రాయిగా పేరొందిన ఈ శిల ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. దేశంలో అనేక ప్రముఖ స్థలాల్లో ఈ రాయితో నిర్మించిన శిలలు దర్శనమిస్తాయి. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న చిన్న కొండ నుంచి నిపుణులు ఈ శిలను ఎంపిక చేశారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి దేశంలోని ప్రముఖ స్థలాల నుంచి శిలలను రప్పిస్తున్నారు. నేపాల్ నుంచి కూడా కొన్ని శిలలను రప్పించినట్లు విశ్వహిందూ పరిషత్ నేతలు చెబుతున్నారు.
అయోధ్యలో ప్రతిష్టించనున్న రాముడి విగ్రహాన్ని తయారు చేయడానికి దేశంలో ఐదుగురు ప్రముఖ శిల్పకారులను ఎంపిక చేశారు. వారే ప్రస్తుతం విగ్రహ తయారీలో నిమగ్నమై ఉన్నారు.
9 feet long Stone called 'ಕೃಷ್ಣ ಶಿಲೆ' (Krishna Shilā) from Karkala's Idu Village has been chosen for Sri Rama's idol to be installed in Ram Mandir.
🚩 Jai Shri Ram 🚩@Swamy39 @jagdishshetty @vhsindia pic.twitter.com/mM5qwgeGOS— Gurudath Shetty Karkala (@GurudathShettyK) March 17, 2023
Ram-Ram Jai Raja Ram,
Ram-Ram Jai SitaRam…🙏🚩Some glimpses of the construction of Shri Ram temple in Shri Ayodhya Ji Dham.@ShriRamTeerth 🛕 pic.twitter.com/Aqw2nkXrZJ
— Kartikey Mishra (@ikartikeymishra) March 18, 2023