ఢిల్లీలో భాదత్యలు చేపట్టిన టీటీడీ సభ్యుల బృందం
ఢిల్లీలో టీటీడీ దేవాలయ సలహా కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఛైర్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఆ దేవ దేవుడి సేవలను దేశ రాజధాని ఢిల్లీతో పాటు, ఉత్తర భారత దేశంలో మరింత విస్తృతం చేయడానికి ఢిల్లీ సలహా మండలి మరింత ఉపయోగపడుతుందని ఛైర్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు.
మరోవైపు ఢిల్లీలో నిర్మించిన శ్రీవారి ఆలయంలో కొన్ని వాస్తు దోషాలు ఉన్నాయని, ఆలయంలో కొన్ని మార్పులు చేయాలని ప్రశాంతి రెడ్డి తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో శ్రీవారి ఆలయం పూర్తిగా కృష్ణ శిలతో నిర్మిస్తున్నట్టు తెలిపారు. అక్కడ శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది నవంబర్ లోపు ఆలయాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో టీటీడీ మరిన్ని ఆలయాలు నిర్మించబోతున్నట్లు తెలిపారు.