Cracker factory: పశ్చిమ బెంగాల్లో (West Bengal) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బాణసంచా ఫ్యాక్టరీలో (cracker factory) భారీ పేలుడు సంభవించింది. ఈప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
Cracker factory: పశ్చిమ బెంగాల్లో (West Bengal) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బాణసంచా ఫ్యాక్టరీలో (cracker factory) భారీ పేలుడు సంభవించింది. ఈప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరి కొంత మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
మోదినీపూర్లోని ఎగ్రా ప్రాంతంలో ఉన్న ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో (cracker factory) ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దట్టమైన పొగలతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎగ్రా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. వారందరికీ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. పేలుడు కారణంగా భవనం పూర్తిగా దెబ్బతిన్నదని పోలీసులు తెలిపారు. చట్టవిరుద్ధంగా బాణసంచా ఫ్యాక్టరీని నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పేలుడు సంభవించడంతో ఫ్యాక్టరీ పూర్తిగా కూలిపోయిందని చెప్పారు. క్రాకర్స్ తయారు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చామని అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని వివరించారు.