Tamil Nadu: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైకు అసమ్మతి సెగ, 13 మంది రాజీనామా
13 BJP members resign and Joined in AIADMK
తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్రంగా తమ ఉనికిని కాపాడుకుందామని భావిస్తున్న బీజేపీకి అనుకోని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 13 మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. పళణిస్వామి ఆధ్వర్యంలో అన్నా డీఎంకే పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వైఖరి కారణంగానే తామీ నిర్ణయం తీసుకున్నామని అసంతృప్త నేతలు విమర్శలు గుప్పించారు. అన్నామలై వ్యవహార శైలితో తామంతా విసిగిపోయామని వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు.
నిర్మల్ కుమార్ రాజీనామా
పార్టీని వీడిన వారిలో ఐటీ వింగ్ చీఫ్ సీటీఆర్ నిర్మల్ కుమార్ తన ఆవేదనను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత ఏడాదిన్నర కాలంగా తాను పార్టీ కోసం ఎంతో నిజాయితీతో పనిచేశానని, ప్రస్తుతం ఎంతో బాధతో పార్టీని వీడుతున్నానని ట్వీట్ చేశాడు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై తమ పార్టీ నాయకులపైనే నిఘా ఉంచుతున్నాడని, తద్వారా పైశాచిక ఆనందం పొందుతున్నాడని ఘాటు విమర్శలు చేశారు. అన్నామలైను 420 మలై అని సంభోదించారు. అన్నామలై వంటి నేతలు పార్టీకి, రాష్ట్రానికి తీరని నష్టం చేకూర్చే వ్యక్తి అని నిర్మల్ కుమార్ విమర్శలు గుప్పించారు.
నిర్మల్ కుమార్ ట్విట్టర్ ద్వారా తన రాజీనామా విషయాన్ని వెల్లడించిన కొద్ద గంటల్లోనే అన్నా డీఎంకే పార్టీ కూడా ట్వీట్ చేసింది. నిర్మల్ కుమార్ తమ పార్టీలో చేరాడని వెల్లడించింది. ఈ రాజకీయ పరిణామాలు గత రెండు రోజులుగా తమిళనాడులో హాట్ టాపిక్ గా మారాయి.
ADMK welcomes CTR Nirmal Kumar. pic.twitter.com/ACp88Yd0Si
— kishore k swamy 🇮🇳 (@sansbarrier) March 5, 2023
இன்று அண்ணன் @EPSTamilNadu அவர்கள் முன்னிலையில்,
IT பிரிவு மாநில செயலாளர் திலீப்,
OBC அணியின் மாநில செயலாளர் ஜோதி
முன்னாள் மாநில செயலாளர் கிருஷ்ணன்,
திருச்சி புறநகர் மாவட்ட துணைத்தலைவர் விஜய் ஆகியோர் @AIADMKOfficial தங்களை இணைத்துக் கொண்டனர்.#எடப்பாடியார்_என்னும்_ஆளுமை pic.twitter.com/i5gTurnmxx— CTR.Nirmal kumar (@CTR_Nirmalkumar) March 7, 2023
.