గత 25 రోజులుగా రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షలు చేస్తున్నారు. రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ప్రపంచస్థాయి రెజ్లర్లు భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేష్ పొగట్ లు నిరసనలు చేస్తున్నారు. గత 25 రోజులుగా నిరసనలు చేస్తున్నా బ్రిజ్ భూషణ్ క్షమాపణలు చెప్పడంగాని, పదవి నుంచి తప్పుకోవడంగాని చేయడం లేదని వాపోతున్నారు.
wrestlers Protest: గత 25 రోజులుగా రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షలు చేస్తున్నారు. రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ప్రపంచస్థాయి రెజ్లర్లు భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేష్ పొగట్ లు నిరసనలు చేస్తున్నారు. గత 25 రోజులుగా నిరసనలు చేస్తున్నా బ్రిజ్ భూషణ్ క్షమాపణలు చెప్పడంగాని, పదవి నుంచి తప్పుకోవడంగాని చేయడం లేదని వాపోతున్నారు. దేశానికి మెడల్స్ సాధించి పెడుతున్న తమకే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే, కొత్త వాళ్లు ఎలా ఇబ్బందులు పడతారో అర్థం చేసుకోవచ్చని నిరసన చేస్తున్న క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు చేప్టి 25 రోజులైన సందర్భంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ నుండి బంగ్లా సాహెబ్ గురుద్వారా వరకు ర్యాలీని నిర్వహించారు.
ఈ ర్యాలీలో క్రీడాకారులతో పాటు మద్దతుగా నిలుస్తున్న ప్రజలు కూడా పాల్గొన్నారు. అంతర్జాతీయ రెజ్లర్ సంఘానికి లేఖ రాసినట్టు భజరంగ్ పూనియా పేర్కొన్నారు. రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛీఫ్ బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, తాను ఎలాంటి తప్పులు చేయలేదని, తనపై ఆరోపణలు ఉంటే కోర్టులో తేల్చుకోవాలని అన్నారు. ఒకవేళ తాను క్షమాపణలు చెబితే తనపై వస్తున్న ఆరోపణలు నిజమేనని అనుకోవలసి వస్తుందని, తప్పు చేయనపుడు తాను ఎందుకు క్షమాపణలు చెప్పాలని, పదవి నుంచి ఎందుకు తప్పుకోవాలని ఎదురు ప్రశ్నిస్తున్నారు. నిరసనలు చేస్తున్న క్రీడాకారులకు మద్దతుగా అన్నదాతలు కూడా నిలవడంతో నిరసనలు మరింత తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉందని క్రీడానిపుణులు హెచ్చరిస్తున్నారు.