1980లో ఏర్పాటు చేసిన బీజేపీ తన ప్రస్థానాన్ని కేవలం రెండు సీట్లతో ప్రారంభించింది. కాగా, ఇప్పుడు ఆ పార్టీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీగా అవతరించింది. 134 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్పార్టీని ధీటుగా ఎదుర్కొంటున్నది. ఎక్కడ ఏ రాష్ట్రంలో పోటీ చేసినా ఆ పార్టీ స్టాండ్ మాత్రం హిందూత్వంవైపే ఉంటున్నది.
Why BJP take Hindutva Stand: 1980లో ఏర్పాటు చేసిన బీజేపీ తన ప్రస్థానాన్ని కేవలం రెండు సీట్లతో ప్రారంభించింది. కాగా, ఇప్పుడు ఆ పార్టీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీగా అవతరించింది. 134 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్పార్టీని ధీటుగా ఎదుర్కొంటున్నది. ఎక్కడ ఏ రాష్ట్రంలో పోటీ చేసినా ఆ పార్టీ స్టాండ్ మాత్రం హిందూత్వంవైపే ఉంటున్నది. అభివృద్ధి, హిందూ ఐక్యత, స్థానిక సమస్యలు వీటి చుట్టూనే ఈ పార్టీ ఎక్కువగా దృష్టి సారిస్తున్నది. బీజేపీ పార్టీ ఆవిర్భావానికి ఆదిమూలం భారతీయ జనసంఘ్… ఈ పార్టీ 1951లోనే ఏర్పాటైంది. ఆ తరువాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. హిందూత్వ నినాదంతో, హిందూవుల ఐక్యత కోసమే ఈ పార్టీ ఆవిర్భవించింది. హిందూ దేవాలయాల పరిరక్షణ కోసమే ఎక్కువగా పనిచేసింది.
ఆర్ఎస్ఎస్తో కలిసి పనిచేసిన పార్టీ ఎమర్జెన్సీ సమయంలో భారతీయ జన సంఘ్ జనతా పార్టీగా మార్పు చెందింది. 1977లో అధికారంలోకి కూడా వచ్చింది. హిందూత్వ రక్షణే ప్రధాన అజెండాగా, రామజన్మభూమి అంశమే శిరోధార్యంగా పనిచేసింది. కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఆ పార్టీ అధికారంలో ఉన్నది. అయితే, 1980 లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 31 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అయితే, కొన్ని అనివార్య కార్యాల వలన ఆ పార్టీని రద్దు చేశారు. దాని స్థానంలో 1980లోనే భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. అప్పటి నుండి నేటి వరకు అదే పేరుతో కొనసాగుతున్నది.
బీజేపీ 1980లో ఆవిర్భవించినా మూలాలు మాత్రం 1951 నుంచే ఉన్నాయి. అప్పటి నుంచే హిందూత్వ ఐక్యత, హిందూ దేవాలయాల పరిరక్షణ, మద్యయుగంలో ధ్వంసమైన ఆలయాలు, సాంస్కృతిక సంపదను పునర్జీవనం కోసం పాటుపడుతూనే ఉన్నది. 1951 నుంచి పార్టీ జెండాలు మారినా, అజెండా మాత్రం మారలేదు. ఓడినా గెలిచినా హిందూత్వ అజెండాతోనే ముందుకు వెళ్తున్నది. రాకెట్ యుగంలో మతాల గొడవలు అవసరమా అనేవారు లేకపోలేదు. అభివృద్ధి ముఖ్యంగాని మతం కాదని చెబుతుంటారు. కాని, ప్రతి దేశానికి ఒక ఓ మూల సిద్ధాంతం ఉంటుంది. ఆచార వ్యవహారాలు ఉంటాయి. సంప్రదాయాలు ఉంటాయి. మూల సిద్ధాంతాన్ని కాపాడుకోవలసి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలం బలంగా లేకుంటే పునాదులతో సహా కుప్పకూలిపోవలసి వస్తుంది. క్రీశ 1000 సంవత్సరాల నుంచి విదేశీయుల దండయాత్రల కారణంగా దేశం ఏం కోల్పోయిందో అందరికీ తెలుసు. పరాయివారి పాలనలో సంపదతో పాటు మన సంస్కృతి, సంప్రదాయలపై కూడా దాడులు జరిగాయి.
అభివృద్ధి అంటే డబ్బులు సంపాదించుకోవడం, బిల్డింగులు కట్టుకోవడం ఒక్కటే కాదు… మన చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందజేయాలి. అప్పుడే ఆ దేశం పునాదులు బలంగా ఉంటాయి. సింధూలోయ, వేదలకాలం నుంచి వీటిని కాపాడుకుంటూ వస్తున్నాం. ప్రస్తుత కాలంలో ఆ సంస్కృతుల్లో మార్పులు చోటు చేసుకున్నా మూల సిద్దాంతం కొంతమేర బలంగానే ఉన్నది. ఈ మూల సిద్ధాంతాన్నే బీజేపీ ముఖ్య అజెండాగా చేసుకున్నది. అందుకే హిందూత్వ అజెండాను మోస్తున్నది. ప్రతి రాజకీయ పార్టీకి ఒక్కో అజెండా ఉంటుంది. కాంగ్రెస్, ఎంఐఎం, డీఎంకే, లెఫ్ట్ పార్టీలు ప్రతి పార్టీ వాటి మూల అజెండాను మోస్తుంటాయి.
అయితే, ఆ అజెండాను ఆహ్వానిస్తారా లేదా తిరస్కరిస్తారా అన్నది ప్రజల చెతుల్లోనే ఉంటుంది. బీజేపీ అజెండా హిందూత్వమే. ఈ స్టాండ్తోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రధాన అజెండాను మార్చుకోవడం లేదు. తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లోనూ ఇదే అజెండాతో పనిచేసేందుకు సిద్దమౌతున్నది. దీనికి ఉదాహరణ కరీంనగర్లో జరిగిన హిందూ ఏక్తా ర్యాలి. అసోం సీఎం హింమత శర్మ, తెలంగాణ బీజేప అధ్యక్షుడు బండి సంజయ్ మాటల్లోనూ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. మరి తెలంగాణ ప్రజలు ఈ అజెండాకు జై కొడతారో లేదంటే కర్ణాటక ప్రజల మాదిరిగా తిరస్కరిస్తారో చూడాలి.