ఈ శాన్య రాష్ర్టం మణిపూర్‌లో (Manipur)మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. రెండు వారాల క్రితం తలెత్తిన భారీ హింస (Violence)నుంచి ఇప్పడిప్పుడే తేరుకుంటున్న మణిపూర్ లో సోమవారం (Monday)మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి.
Manipur Army : ఈ శాన్య రాష్ర్టం మణిపూర్‌లో (Manipur)మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. రెండు వారాల క్రితం తలెత్తిన భారీ హింస (Violence)నుంచి ఇప్పడిప్పుడే తేరుకుంటున్న మణిపూర్ లో సోమవారం (Monday)మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. ఇంఫాల్ (Imphal)లోని న్యూ చెకాన్ ఏరియాలో మైతీ, కుకీ వర్గాలు బాహాబాహీకి దిగాయి. స్థానిక మార్గెట్ (Market)లో స్థలం విషయంలో ఈ ఘర్షణ చోటుచేసుంది. దీంతో రెచ్చిపోయిన అల్లరిమూక లాంబులేన్ ప్రాంతంలో ఇళ్లకు నిప్పుపెట్టింది. ఇటీవల హింసాకాండ భయంతో జనం వదిలివెళ్లిన ఇళ్లకు అల్లరిమూక నిప్పుపెట్టడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఆర్మీ, పాలామిటలరీ బలగాలు హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేస్తున్నాయి. ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలో తక్షణం కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు.
మళ్లీరాజుకుంటుందా…
షెడ్యూల్డ్ కులాల్లోకి తమను చేర్చాలనే మైతీల డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3న గిరిజనులు చేపట్టిన సంఘాభావ యాత్ర హింసాకాండకు దారితీసింది. వారం రోజుల పాటు కొనసాగిన ఈ అల్లర్లలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది రూపాయల ప్రజా ఆస్తులు బుగ్గిపాలయ్యారు. వేలాది మంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని శరణార్థ శిబిరాలకు తరలివెళ్లారు. హింసను అదుపు చేసేందుకు ఆర్మీ, పాలామిలటరీ దళాలు తీవ్రంగా శ్రమించాయి. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో తాజాగా మరోసారి ఇరువర్గాలు బాహాబాహీకి దిగడం, ఇళ్లు తగులబెట్టిన ఘటనలు చోటుచేసుకోవడంతో ఎప్పుడేం జరుగుతుందోనని టెన్షన్ మొదలైంది..
#WATCH | Abandoned houses set ablaze by miscreants in New Lambulane area in Imphal in Manipur. Security personnel on the spot. pic.twitter.com/zENI5nuMyM
— ANI (@ANI) May 22, 2023