పదవీ విరమణ అయ్యాక ఓ బస్ డ్రైవర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. పని అంటే ఎంత ఇష్టమో.. ఆ పని దూరమైతే ఎంత కష్టమో నిరూపించాడు.
Tamilnaadu Bus driver: ఎంత కష్టమైనా కొందరికి పనే దైవం.. చేస్తున్న పనిని కష్టమైనా భరిస్తారు చాలా మంది. నమ్ముకున్న పనిని ప్రాణం పెట్టి చేసేవాళ్లు ఎంతో మంది. ఆ పనిలోనే సంతోషాన్ని వెతుకుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇష్టపడే పని ఒక రోజు లేకపోయినా కాళ్లూ చేతులూ ఆడవు కొంత మందికి. వరుసగా సెలవులొస్తే ఇంట్లో చికాకు పడి చిందులు తొక్కేవాళ్లను చాలా మందిని చూస్తుంటాం. చేస్తున్న పనిలో అంచనాలకు అందని ఫలితాలు ప్రదర్శించి ప్రశంసలు పొందుతారు మరికొందరు. అలా అమితంగా ఇష్టపడే పని నుంచి శాశ్వతంగా తప్పుకోవాల్సి వస్తే తట్టుకోలేరు . సరిగ్గా ఇలాంటి వ్యక్తే తమిళనాడుకు చెందిన ముత్తుపాండి. పని అంటే ఎంత ఇష్టమో.. తెలుసుకుంటే వార్నీ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అనటం ఖాయం..
ముత్తుపాండి అంటే సెన్సేషన్..
మధురై జిల్లా బైకరాకు చెందిన ముత్తుపాండి కొంత కాలంగా తిరుపరంగునం ఆర్టీసీ డిపో వర్క్‌షాప్‌లో పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన తిరుపరంగునం పట్టణంలో చాలా సంవత్సరాలు ఆర్టీసీ బస్సు నడిపారు. ఆర్టీసీలో 30 ఏళ్లుగా పనిచేసిన ముత్తుపాండి నాలుగు రోజుల కిందట తనకు 60 ఏళ్లు నిండటంతో పదవీ విరమణ చేశారు. అయితే, ఉద్యోగంలో తన చివరి రోజు ఇన్నాళ్లూ తాను నడిపిన ప్రభుత్వ బస్సును నడుపుతానని ఆయన కోరారు. అందుకు అధికారులు అనుమతించారు. పటనాడి – తిరుపరంగుంరం రూట్ నంబర్ 31 ఎలో చివరి ట్రిప్‌లో బస్సును ముత్తుపాండి నడిపారు. తిరుపనాడి, మహాలక్ష్మి కాలనీ మీదుగా వెళ్లి, తిరిగి బస్సును తీసుకొచ్చి డిపోలో పార్కింగ్ చేశారు. ఆ తర్వాత తాను నడిపిన బస్సు స్టీరింగ్‌పై వాలి భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కిందకి దిగి బస్సు ముందు భాగాన్ని ముద్దులు పెడుతూ సోషల్ వీడ్కోలు పలికారు . రిటైర్ మెంట్ రోజు బస్సును, స్టీరింగ్‌ను ప్రేమగా ముద్దాడాడు. బస్సు ముందు భాగాన్ని హత్తుకొని భావోద్వేగంతో కన్నీళ్లు చెమర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అందరికీ ఆదర్శం..
డ్రైవర్ ముత్తుపాండి తన వృత్తిని ఎంతగానో ఇష్టపడి, గౌరవించి పనిచేశారని ఆయన గురించి తెలిసిన పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. చేసే వృత్తిని దైవ సమానంగా భావించాలనే దానికి ఈ సన్నివేశమే ఉత్తమ ఉదాహరణ అని మరికొంత మంది కామెంట్స్ చేశారు.
డ్రైవర్ ముత్తుపాండి ఎమోషన్.. కదిలించే వీడియో మీరూ చూడండి…
#கடைசியாஒருமுறை… ஓய்வு பெறும் நாளில் நெகிழ்ச்சி… #பேருந்தை கட்டிப்பிடித்து அழுத ஓட்டுநர் #முத்துப்பாண்டி..@CMOTamilnadu @sivasankar1ss @kalilulla_it @abm_tn @rajakumaari @DonUpdates_in @PTRajkumar97899 @Vel_Vedha pic.twitter.com/pFjkbOcnnG
— Nowshath A (@Nousa_journo) June 1, 2023