అనుకున్నట్టుగానే మోడీ ప్రభుత్వం రూ. 2 వేల నోట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఆర్బీఐ మే 19న ఆ నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది.
Rs 2000 Currency Notes Withdrawn: అనుకున్నట్టుగానే మోడీ ప్రభుత్వం రూ. 2 వేల నోట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఆర్బీఐ మే 19న ఆ నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ఈ గడువులోగా డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, డబ్బును డిపాజిట్ చేయడానికి కేవైసీని అనుసరించి పరిమితులు విధించింది. బ్యాంకు డిపాజిటర్ దార్లు వారి కేవైసీని అనుసరించి బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. అంతేకాదు, రెండువేల నోట్లను మార్చుకోవాలంటే ప్రజలు ఒకసారి 20 వేల వరకు మార్చుకోవచ్చు. ఇక బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా రోజుకు రూ. 4 వేల వరకు నోట్లను మార్చుకోవచ్చు. రూ. 2 వేల నోట్లు రద్దు వెంటనే అమలు కాదు. మార్చుకునేందుకు వీలుగా నాలుగు నెలల సమయాన్ని ఇచ్చింది.
ఈ నాలుగు నెలల సమయంలోగా నోట్లను మార్చుకోవలసి ఉంటుంది. 2 వేల నోట్ల డిపాజిట్ కోసం అన్ని బ్యాంకుల్లోని బ్రాంచ్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. వీటి ద్వారా డబ్బును డిపాజిట్ చేసుకోవాలి. ఒకవేళ ఏ బ్రాంచ్ కు చెందిన వారైనా డబ్బును డిపాజిట్ చేసుకోవడానికి అడ్డంకి కలిగిస్తే కంప్లైంట్ చేయవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. అయితే, డిపాజిట్ ఖాతాదారుడి కేవైసీని అనుసరించి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30 తరువాత డిపాజిట్ చేయని డబ్బు చెల్లుబాటు కాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో అత్యవసరం కోసమే రూ. 2 వేల నోట్లను తీసుకొచ్చారు. వీటి అవసరం తీరిపోయిందని, అందుకే వెనక్కి తీసుకుంటున్నామని ఆర్బీఐ చెబుతున్నది. భారత్ ప్రపంచంలో ఆర్థిక రంగంలో ఐదోస్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో జర్మనీని వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని భారత్ ఆక్రమించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మొదటి నాలుగు స్థానాల్లో భారత్ ఒకటిగా ఉండేందుకు కృషి చేస్తున్నది.