మోడీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో 2016 నవంబర్ 8 న పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొదటిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
RBI on Currency Notes: మోడీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో 2016 నవంబర్ 8 న పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొదటిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే విషయం ఎవరికీ అంతుపట్టలేదు. ఈ నిర్ణయం తీరువాత డబ్బుకోసం ఏటీఎంల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరిన సంగతి తెలిసిందే. 1000, 500 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా 2 వేలు, 500 నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. పెద్ద నోట్లను రద్దు చేయడంతో లక్షలాది మంది బిచ్చగాళ్లుగా మారిపోయారు. చేతిలో డబ్బు ఉన్నా వాటికి విలువ లేకపోవడంతో అలో లక్ష్మణా అంటూ నెత్తినోరు బాదుకున్నారు.
పెద్ద నోట్లను బ్యాన్ చేసిన కొన్ని రోజులకే కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చాయి. దశల వారీగా నోట్ల సంఖ్యను పెంచుతూ వచ్చింది. కొత్త డబ్బు చెలామణిలోకి రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే సమయంలో డిజిటల్ రంగాన్ని ప్రభుత్వం ప్రొత్సహించింది. డిజిటల్ చెల్లింపులు పెరగడంతో ఫిజికల్ మనీని క్యారీ చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కరోనా సమయంతో పిజికల్ కరెన్సీ కంటే డిజిటల్ కరెన్సీ ద్వారానే పంపిణీలు జరిగాయి. స్మార్ట్ ప్రపంచం కావడం, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అందుబాటులో రావడంతో డిజిటల్ మనీకే ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చారు.
2 వేల నోట్లు చలామణిలోకి వచ్చినప్పటి నుంచే వీటిని కూడా రద్దు చేస్తారనే వార్తలు వస్తూ వచ్చాయి. అయితే, ఎప్పుడు సడెన్‌గా నిర్ణయం తీసుకుంటారన్నది తెలియలేదు. పెద్ద నోట్ల రద్దు జరిగి ఎనిమిదేళ్లు అవుతున్న సందర్భంగా మళ్లీ నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. చాలా కాలంగా ఆర్బీఐ 2 వేల నోట్లను ప్రింట్ చేయడం లేదు. ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లను కూడా వాపస్ తీసుకోవాలని నిర్ణయిస్తూ ప్రకటన చేయడం ఆసక్తికరం. 2023, సెప్టెంబర్ 30 లోపు దేశంలో ఉన్న 2 వేల నోట్లను వెనక్కి ఇచ్చేయ్యాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. 2 వేల నోట్లను వినియోగదారులకు ఇవ్వొద్దని ఆదేశాల్లో పేర్కొన్నది.
ఇంత సడెన్‌గా నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని మేధావులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇక, పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్ పార్టీ మీమ్స్‌ను క్రియోట్ చేసింది. 2 వేల నోటు రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి మీమ్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నది. ఏటీఎం మిషిన్లలో 500, 200, 100 తప్పించి 2 వేల నోట్లు రావడంలేదు. పెద్ద నోట్ల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని నిర్ణయించింది. 2016 నవంబర్ 8 పెద్ద నోట్లను రద్దు చేయగా, 2017 మార్చి నాటికి 2000 నోట్లు 89 శాతం వరకు చెలామణిలోకి వచ్చాయి. కొత్తగా చెలామణిలోకి వచ్చిన నోట్ల కాలపరిమితి 4 నుంచి 5 సంవత్సరాలుగా నిర్ణయించారు. కానీ, ఈ నోట్లు గత ఏడేళ్లుగా చలామణిలో ఉన్నాయి. ఈ నోట్లకు కాలం చెల్లడంతో 2వేల నోట్లను వెనక్కి తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది. 2023, మే 19న ఈ నోట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. 2023, సెప్టెంబర్ 30 వరకు బయట చలామణిలో ఉన్న నోట్లను తిరిగి బ్యాంకులకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డేట్ దాటితే 2 వేల నోట్లు చెల్లనివిగా మారిపోతాయి. వీటి స్థానంలో కొత్త నోట్లను జారీ చేస్తారా లేదంటే తిరిగి వెయ్యి నోట్లను జారీ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.