బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దేశంలోని బీజేపీని ఎలాగైనా దించాలని చూస్తున్నారు. ఎలాగైనా బీజేపీని గద్దెదించి ఆ పీఠాన్ని అధిష్టించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. మోడీ పేరు వెలుగులోకి రాకముందు, ఎన్డీయే ప్రధాని నేతగా ఆయనపేరు తెరమీదకు వచ్చింది. నితీష్ కుమార్, శివరామ్ సింగ్ చౌహాన్, తదితరుల పేర్లు తెరమీదకు వచ్చాయి.
National Politics: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దేశంలోని బీజేపీని ఎలాగైనా దించాలని చూస్తున్నారు. ఎలాగైనా బీజేపీని గద్దెదించి ఆ పీఠాన్ని అధిష్టించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. మోడీ పేరు వెలుగులోకి రాకముందు, ఎన్డీయే ప్రధాని నేతగా ఆయనపేరు తెరమీదకు వచ్చింది. నితీష్ కుమార్, శివరామ్ సింగ్ చౌహాన్, తదితరుల పేర్లు తెరమీదకు వచ్చాయి. అయితే, ఎన్డీయే ఇంటర్నల్‌గా సర్వేను నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం, సడెన్‌గా మోడీ పేరు తెరమీదకు రావడం, 2014 ఎన్నికల్లో మోడీ గాలి వీయడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మోడీ అధినాయకత్వంలో బీజేపీ దేశంలో మరింత బలం పుంజుకుంది. వేగంగా రాష్ట్రాల్లో విస్తరించింది. ఐదేళ్లలో ఎన్నడూ లేనంత బలంగా మారిపోయింది. గతంలో వివిధ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటయ్యేవి. నేడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఏ రాష్ట్రంలో తీసుకున్నా దాదాపుగా ఇలానే కనిపిస్తున్నాయి.
బీహార్‌లో నితీస్ కుమార్ గతంలో ఆర్జేడీతో కలిసి పనిచేశాడు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. బీజేపీతో చేతులు కలిపారు. గత ఎన్నికల్లో పొత్తు ఉన్నప్పటికీ నితీష్ కుమార్ పార్టీ కేవలం 40 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. అయినప్పటికీ పొత్తుల్లో భాగంగా నితిష్ కుమార్‌కు అవకాశం ఇచ్చారు. అయితే, కొంతకాలం కలిసి కాపురం చేసిన నితీష్ కుమార్, బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. ఆ పార్టీ నుండి బయటకు వచ్చి పాత మిత్రులు ఆర్జేడీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. అప్పటి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
కాంగ్రెస్ దగ్గరవుతూ దేశంలో బీజేపీని గద్దె దించాలని, అప్పుడే దేశానికి హ్యాపీగా ఉంటుందని ప్రచారం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీతో మాత్రమే కాదు, అవసరమైతే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు ఉన్నా వారితో కలిసి పోరాటం చేసుందుకు సై అంటున్నాడు నితీష్ కుమార్. వరసగా అనేక పార్టీ అధినేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ కూటమిలో ఉంటూనే, మూడో ఫ్రంట్ పేరుతో మరో కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్‌తో అంటకాగేందుకు కూడా సిద్దమౌతున్నాడు. మమతతో భేటీలు, స్టాలిన్‌తో చర్చలు, కేజ్రీవాల్లో షేక్హ్యాండ్లు ఇస్తున్నాడు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు నినాదాలు చేసినా వారు తనవారేనని అంటున్నాడు.
ఇక ఇదిలా ఉంటే, కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అదే ఊపుతో దేశంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం సాధించాలని చూస్తున్నది. దానికి తగినట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. రాష్ట్రాల ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. రాష్ట్రాల ఎన్నికల్లో స్థానిక సమస్యలపై ఆధారపడి ఎన్నికలు ఉంటాయి. కానీ, పార్లమెంట్ ఎన్నికలు అలా కాదు, పార్లమెంట్ ఎన్నికలు దేశానికి సంబంధించి, దేశ సమస్యల ప్రధానంగా, దేశ అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. దేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా ఎన్నికలు జరుగుతాయి. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి సముచిత స్థానాన్ని తీసుకొచ్చి, భారత్ అంటే అందరూ గౌరవించేలా ఖ్యాతిని తీసుకొచ్చిన మోడీని ఓడించడం కాంగ్రెస్‌కు సాధ్యమౌతుందా… చూడాలి. ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగినా మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ముందస్తు సర్వేలు చెబుతున్నాయి. గతంలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువగా స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమాను బీజేపీ వ్యక్తం చేస్తున్నది. మరి ఎవరు గెలుస్తారు… ఎవరు ఓటమిపాలవుతారు అనే విషయాలు తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.