భారత్ నుంచి ఎక్కువ సంఖ్యలో విదేశాలకు ఎగుమతి అయ్యే వాటిల్లో మెడిసిన్స్ కూడా ఒకటి. పెద్ద సంఖ్యలో మందులను విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కరోనా సమయంలో వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేశారు. సుమారు 150 కి పైగా దేశాలకు ఎగుమతి చేశారు.
Cough Syrup Export: భారత్ నుంచి ఎక్కువ సంఖ్యలో విదేశాలకు ఎగుమతి అయ్యే వాటిల్లో మెడిసిన్స్ కూడా ఒకటి. పెద్ద సంఖ్యలో మందులను విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కరోనా సమయంలో వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేశారు. సుమారు 150 కి పైగా దేశాలకు ఎగుమతి చేశారు. 140 కోట్ల మంది జనభా కలిగిన భారత్‌లో అందరికీ వ్యాక్సిన్లు అందించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందులోనూ రెండు డోసుల వ్యాక్సిన్లు అందించాలంటే చాలా కష్టం. అంతటి కష్టంలోనూ భారత్ వ్యాక్సిన్లను అందించింది.
ఇక ఇదిలా ఉంటే, ఇటీవల కాలంలో విదేశాలకు ఎగుమతి చేస్తున్న దగ్గు మందుపై అనేక ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యతలపై కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఈ దగ్గుమందు ఎగుమతులపై కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. కాఫ్ సిరప్‌లను ఇంతకు ముందు నేరుగా కంపెనీల నుంచి ఎక్స్పోర్ట్ చేసేవారు. కానీ, ఇకపై అటువంటివి కుదరబోవని కేంద్రం స్పస్టం చేసింది. తయారైన మందులను ప్రభుత్వ ల్యాబ్‌లలో టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ రిపోర్ట్ తరువాతే ఎగుమతులు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ సంస్థ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వాల అనుమతులు పొందిన ల్యాబ్‌లు మందులను తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ప్రమాణాలకు అనుగుణంగా తయారైన మందులను మాత్రమే ఎక్స్పోర్ట్ చేసేందుకు అనుమతులు మంజూరు చేస్తారు. జూన్ 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతైన కాఫ్ సిరప్ కారణంగా గాంబియా, ఉజ్బెకిస్తాన్ దేశాల్లో 84 మంది చిన్నారులు మరణించారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఔషదాల తయారీపై కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించింది.