ఈ కొత్త విధానంపై వచ్చే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చట్టం అమలు చేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కేంద్రం భావిస్తోంది.
New Bill On Voters : దేశంలో జనన, మరణాల నమోదు ఆధారంగా భవిష్యత్తులో ఓటర్ల (Voters) జాబితా (List)లో ఆటోమేటిక్ (Automatic)గా మార్పులు చేసే ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం(Central Government) భావిస్తోంది. త్వరలోనే దీనిపై పార్లమెంటు (Palrliment)లో బిల్లు (Bill)ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. దేశం (Country)లో జనగణన కోసం పటిష్టమైన చర్యలు చేపడుతున్న కేంద్రం.. జనాభా లెక్కల సేకరణ కోసం జియోఫెన్సింగ్ (Gio Fencing) అప్లికేషన్ (Application)ను కేంద్రం సిద్ధం చేసింది.
ఏమిటా చట్టం
కొత్త చట్టం ప్రకారం… పుట్టిన పిల్లల పేర్లను తల్లిదండ్రులు జననాల జాబితాలో నమోదు చేస్తారు. ఈ జాబితాలో పేర్లు నమోదైన వారికి 18 ఏళ్లు నిండగానే.. వెంటనే నేరుగా ఎన్నికల సంఘం ఫోన్లో సందేశం పంపుతుంది. ఓటు నమోదు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తుంది. అలా వారి పేర్లు ఓటర్ల జాబితాలో చేరిపోతాయి. ఎవరైనా చనిపోతే మరణాల జాబితా ద్వారా ఎన్నికల సంఘానికి సమాచారం వెళ్తుంది. ఆ సమాచారం ఆధారంగా మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరించి 15 రోజుల్లో ఎన్నికల జాబితా నుంచి పేరును తొలగించేలా నిబంధనలు తీసుకొస్తున్నారు.
త్వరలో బిల్లు
ఇలాంటి ఎన్నో మార్పులతో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు తీసుకురాబోతున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. సమాచారాన్ని ఒకచోట మారిస్తే అన్నిచోట్లా అప్డేట్ అయ్యేలా కొత్త విధానం అమలు కాబోతోందన్నారు. జనన మరణాల చట్టం – 1969 కి సవరణలు చేయబోతున్నారు. ఈ కొత్త చట్టం ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌లు, పాస్‌పోర్ట్‌ల జారీ సులువుగా మారుతుందని తెలిపారు. ఇవే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు మరింత వేగంగా, సులువుగా అందించడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు.
జనగణన ఎలా అంటే…
దేశంలో జనాభా లెక్కల సేకరణ కోసం జియోఫెన్సింగ్ అప్లికేషన్‌ను రూపొందించామని అమిత్ షా స్పష్టం చేశారు. దీని ద్వారా క్షేత్ర స్థాయిలో జనాభా లెక్కలు సేకరించేవారు తమకు కేటాయించిన బ్లాక్‌లో పర్యటించకుండా లెక్కలు నమోదు చేస్తే వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం వెళ్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్లాక్‌లనూ ఇప్పుడు జియోఫెన్సింగ్ చేస్తున్నట్లు చెప్పారు. జనగణన ఖచ్చితంగా చేస్తేనే నిజమైన లబ్ధిదారులకు అభివృద్ధి ఫలాలు అందుతాయని పేర్కొన్నారు