నేటి ఈ ఆధునిక యుగంలో మొబైల్ ఫోన్ అత్యంత విలువైన వస్తువుగా మారిపోయింది. పదివేలు పెట్టికొన్నా... దానిని పది లక్షల కంటే విలువైనదిగా భావించి జాగ్రత్త పరుచుకుంటారు. ఫోన్ ఖరీదు ముఖ్యం కాదు... అందులో ఉండే డేటానే ముఖ్యం. ఆండ్రాయిడ్ మొబైల్ అందుబాటులోకి వచ్చాక, అందులో ఎలాంటి డేటాను స్టోర్ చేసుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం లేదు.
Mobile Phone New Tracking System: నేటి ఈ ఆధునిక యుగంలో మొబైల్ ఫోన్ అత్యంత విలువైన వస్తువుగా మారిపోయింది. పదివేలు పెట్టికొన్నా… దానిని పది లక్షల కంటే విలువైనదిగా భావించి జాగ్రత్త పరుచుకుంటారు. ఫోన్ ఖరీదు ముఖ్యం కాదు… అందులో ఉండే డేటానే ముఖ్యం. ఆండ్రాయిడ్ మొబైల్ అందుబాటులోకి వచ్చాక, అందులో ఎలాంటి డేటాను స్టోర్ చేసుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. వందరకాల పాస్వర్డ్స్ పెడుతుంటారు. ప్రతి ఫీచర్‌కు ఒక పాస్వర్డ్… అదేమంటే స్టోరేజ్ సేఫ్ కోసమని చెబుతుంటారు. ఇదంతా బాగానే ఉంది… ఒకవేళ నిజంగానే మొబైల్ ఫోన్ పోతే పరిస్థితి ఏంటి…
అటువంటి టెన్షన్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తసుకొచ్చింది. సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమ్యాట్రిక్స్ సంస్థ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పేరుతో ఓ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దేశంలోని అన్ని కంపెనీల మొబైల్ ఫోన్లను ఈ సీఈఐఆర్ కిందకు తీసుకురాబోతున్నారు. ఈనెల 17 నుండి ఈ వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. దేశంలో తయారు చేసే, విక్రయించే మొబైల్ఫోన్ల 15 అంకెల ఐఎంఈఐ నెంబర్‌ను ఈ సీఈఐర్కు తెలియజేయవలసి ఉంటుంది. ఈ సంస్థ ఐఎంఈఐ నెంబర్‌ను మొబైల్ ఫోన్ నెంబర్‌తో జత చేస్తుంది. ఎప్పుడైనా మొబైల్ పోతే వెంటనే ఈ సంస్థ ట్రేస్ చేస్తుంది. ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. తద్వారా దొంగిలించబడ్డ మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ సిస్టమ్ అందుబాటులోకి వస్తే మొబైల్ ఫోన్ల దొంగతనాలు తగ్గిపోతాయని సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమ్యాట్రిక్స్ సంస్థ తెలియజేస్తున్నది.