కర్ణాటక పీఠంపై ఎవరు కూర్చుంటారనే దానిపై ఈరోజు మధ్యాహ్నం వరకు ఉన్న ఉత్కంఠకు తెరపడింది. సాయంత్రం సీఎల్పీ మీటింగ్‌ను నిర్వహించారు. ఈ మీటింగ్‌లో ఎల్పీ నేతను ఎన్నుకున్నారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ ఎల్పీ నేతగా సిద్దరామయ్య పేరును ప్రతిపాదించారు. సిద్దరామయ్య పేరును ప్రకటించగానే... అందరూ ఆమోదించారు.
Karnataka Politics: కర్ణాటక పీఠంపై ఎవరు కూర్చుంటారనే దానిపై ఈరోజు మధ్యాహ్నం వరకు ఉన్న ఉత్కంఠకు తెరపడింది. సాయంత్రం సీఎల్పీ మీటింగ్‌ను నిర్వహించారు. ఈ మీటింగ్‌లో ఎల్పీ నేతను ఎన్నుకున్నారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ ఎల్పీ నేతగా సిద్దరామయ్య పేరును ప్రతిపాదించారు. సిద్దరామయ్య పేరును ప్రకటించగానే… అందరూ ఆమోదించారు. సీఎల్పీ నేత ఎంపిక పూర్తయ్యాక సిద్దరామయ్య, డీకె శివకుమార్‌లు రాజ్‌భవన్‌కు వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కోరనున్నారు. ఈనెల 20వ తేదీన సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా, డిప్యూటి సీఎంగా డీకె శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరితో పాటు మంత్రులుగా మరికొందరు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడటంతో కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాణస్వీకారం చేసే రోజున ఏ ఫైల్ మీద సంతకం పెట్టబోతున్నారనే దానిపై సందిగ్దత నెలకొన్నది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఐదు అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు 2000, నిరుద్యోగులకు 3000 బృతి వంటి హామీలను ఇచ్చింది. ఈ హామీలను తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎవరు అన్నది తేలకముందే విద్యుత్ అధికారులకు కొప్పల్, కలుబురిగి, చిత్రదుర్గ జిల్లాలకు చెందిన కొన్ని గ్రామాల ప్రజలు తాము విద్యుత్ బిల్లులు చెల్లించబోమని, బిల్లులు సిద్దరామయ్యకు, డీకె శివకుమార్‌కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకపై తమ గ్రామాలకు బిల్లుల కోసం రావొద్దని పేర్కొన్నారు.