కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 35 సంవత్సరాల తరువాత ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టారు కన్నడిగులు. పార్టీ ఈ విజయాన్ని భారీ ఎత్తున సెలెబ్రేట్ చేసుకుంది. పార్టీ విజయం సాధించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి బీజేపీపై వ్యతిరేకతైతే, రెండోది మేనిఫెస్టో. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఐదు ఉచిత పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నది.
Karnataka Congress:కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 35 సంవత్సరాల తరువాత ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టారు కన్నడిగులు. పార్టీ ఈ విజయాన్ని భారీ ఎత్తున సెలెబ్రేట్ చేసుకుంది. పార్టీ విజయం సాధించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి బీజేపీపై వ్యతిరేకతైతే, రెండోది మేనిఫెస్టో. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఐదు ఉచిత పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నది. వాటికి పంచరత్నాలు అనే పేరుకూడా పెట్టింది. రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ, మహిళలకు ఉచితంగా నెలకు రూ. 2 వేలు, నిరుద్యోగులకు భృతి రూ. 3 వేలు, మహిళలకు బస్సుల్లో ఫ్రీ ప్రయాణం… దీంతో పాటు పేద ప్రజలకు నెలకు 10 కిలోల ఉచిత బియ్యం వంటివి అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నది. దీంతో పాటు మత్స్యకారులకు నెలకు 500 లీటర్ల డీజిల్‌ను అందిస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని అమలు చేస్తామని ప్రకటించింది.
ఈ హామీలు ప్రజల్లో తెలియని ఆనందాన్ని ఇచ్చాయి. మహిళలకు ఉచిత ప్రయాణం, నెలకు రెండు వేలు, 200 యూనిట్ల వరకు కరెంట్ ప్రీ, బీపీఎల్ కుంటుంబానికి నెలకు 10 కిలోల బియ్యం అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. ఒక సాధారణ కుటుంబం ఈ పథకాలతో హాయిగా బతికేయవచ్చు. అరకొర వచ్చే సంపాదనను దాచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ పథకాల కారణంగానే ఆ పార్టీకి ఓటు బ్యాంక్ పెరిగింది. ఇదే ఇప్పుడు ఆ పార్టీకి తిప్పలు తెచ్చిపెట్టే విధంగా మారింది. పంచరత్నాలు, డీజిల్ పథకాన్ని అమలు చేయాలంటే నెలకు సాలీన రూ. 5 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. ఏడాదికి రూ. 62 వేల కోట్లు ఖర్చు అవుతుందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే, రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం బడ్జెట్‌ను ఈ పథకాల అమలు కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటికోసం అమలు చేస్తే మిగతా వాటికి ఏం ఖర్చు చేస్తారు… ఎలా ఖర్చు చేస్తారని ప్రతిపక్ష హోదాను సొంతం చేసుకున్న బీజేపీ ప్రశ్నిస్తోంది. తలకు మించిన భారమయ్యే ఉచితాల హామీలను ఇవ్వొద్దని సుప్రీంకోర్టు వంటి సంస్థలు హెచ్చరిస్తున్నా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా ఇలా ఉచిత హామీలను ఇస్తూ రాష్ట్రాలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.