మిగ్ 21 ఫైటర్ జెట్ విమానాలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఇండియా పాక్, ఇండియా చైనా యుద్దాల్లో మిగ్ 21 ఫైటర్ జెట్ విమానాలు కీలక పాత్రను పోషించాయి. ప్రస్తుతం ఈ విమానాలు పైలట్ ట్రైనింగ్ కింద వినియోగిస్తున్నారు. ట్రైనింగ్ కోసంమే కాకుండా కొన్ని కీలక విభాగాల్లో ఈ జెట్ ఫ్లైట్లను యుద్ధం కోసం కూడా వినియోగిస్తున్నారు.
MIG 21 Fighter Jet: మిగ్ 21 ఫైటర్ జెట్ విమానాలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఇండియా పాక్, ఇండియా చైనా యుద్దాల్లో మిగ్ 21 ఫైటర్ జెట్ విమానాలు కీలక పాత్రను పోషించాయి. ప్రస్తుతం ఈ విమానాలు పైలట్ ట్రైనింగ్ కింద వినియోగిస్తున్నారు. ట్రైనింగ్ కోసంమే కాకుండా కొన్ని కీలక విభాగాల్లో ఈ జెట్ ఫ్లైట్లను యుద్ధం కోసం కూడా వినియోగిస్తున్నారు. 1960 నుంచి మనదేశం మిగ్ 21 రకం విమానాలను వినియోగిస్తున్నది. కాలం చెల్లిపోయినప్పటికీ అవసరాలకు తగినంతగా విమానాలు లేకపోవడంతో వీటినే వినియోగించక తప్పడం లేదు. అత్యధికంగా ఈ విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని హనుమాన్ ఘర్ జిల్లాలోని బహోల్ నగర్ లోని ఓ ఇంటిపై కుప్పకూలింది.
ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. గ్రామంలో భారీగా ఆస్తినష్టం సంభవించింది. జెట్ విమానంలో లోపాల కారణంగానే ఈ విమానాలు కూలుతున్నాయి. ఆధునీకరించేందుకు కూడా ప్రస్తుతం అవకాశం లేకపోవడంతో తాత్కాలికంగా బ్యాన్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం మూడు ఐఏఎఫ్ స్క్వాడ్రన్లు మాత్రమే వీటిని వినియోగిస్తున్నారు. కాగా, వీటి స్థానంలో భారత్‌లో తయారైన తేజస్ పైటర్ జెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఫైటర్ జెట్ విమానాల ధరలు అధికంగా ఉండటంతో పాతవాటినే వినియోగిస్తున్నారు. ఇంజిన్‌లో లోపాలు, ఇతర సాంకేతిక లోపాల కారణంగా మిగ్ విమానాలు కూలిపోతున్నాయని ఆందోళనలు చెందుతున్నారు.