ఆర్బీఐ రెండు వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన తరువాత అందరిలోనూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నోట్లు వెనక్కి తీసుకుంటున్నారంటే అవి బయట చెల్లవేమోననే వదంతులు వ్యాపించడంతో ప్రజల్లో తెలియని అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి.
Rs 2 Thousand Currency Notes: ఆర్బీఐ రెండు వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన తరువాత అందరిలోనూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నోట్లు వెనక్కి తీసుకుంటున్నారంటే అవి బయట చెల్లవేమోననే వదంతులు వ్యాపించడంతో ప్రజల్లో తెలియని అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, ఆర్బీఐ దీనిపై క్లారిటీ ఇచ్చింది. నోట్లను రద్దు చేయడం లేదని, వెనక్కి మాత్రమే తీసుకుంటున్నామని ప్రకటించింది. రెండు వేల నోటు లక్ష్యం నెరవేరిందని అందుకే వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది.
మే 23 నుంచి బ్యాంకులు ఈ నోట్లను స్వీకరించాలని ఆర్బీఐ ఆదేశించింది. ఎస్బీఐ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నోట్లను స్వీకరించిన తరువాత వాటిని అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడానికి లేదంటే మార్చుకోవడానికి అనుకూలంగా అవకాశాలు కల్పించాలి. నోట్లను స్వీకరించే సమయంలో ఐడీ కార్డులు చూపనవసరం లేదని, 20 వేల వరకు మార్చుకునే వెసులుబాటు కల్పించింది.
దీంతో మొదటిరోజే బ్యాంకుకు ప్రజలు పోటెత్తారు. దాచుకున్న 2 వేల నోట్లను తీసుకొని బ్యాంకులకు వెళ్లారు. పెద్ద సంఖ్యలో బారులు తీరి కనిపించడంతో బ్యాంకు అధికారులు షాకయ్యారు. భారీ సంఖ్యలో ప్రజలు ముఖ్యంగా వృద్ధులు క్యూలైన్లో ఉండటం కనిపించింది. నోట్లను వీలైనంత త్వరగా మార్చుకోవాలన్నది వారి తాపత్రయం. అయితే, ఎలాంటి ఐడీ కార్డులు చూపకుండా ఒకసారికి 20 వేల వరకు మార్చుకోవచ్చని ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై విమర్శులు ఎదురౌతున్నాయి. ఐడీ కార్డులు చూపకుండా మార్చుకోవడం అంటే మనీ ఎక్చేంజ్ చట్టాల ఉల్లంఘన అవుతుందని కొందరు న్యాయవాదులు చెబుతున్నారు. మొదటిరోజు పెద్ద సంఖ్యలో పెద్ద నోట్లను పుచ్చుకొని ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.